భూగర్భ జలాలు పొదుపుగా వాడుదాం..
– మండల వ్యవసాయ అధికారి వీరభద్రం
కాకతీయ,రాయపర్తి : మండలంలోని పెరికేడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’లో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.బుధవారం గ్రామ సర్పంచ్ తీగల సాయిలు గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరభద్రం పాల్గొని మాట్లాడారు.రైతులు యాసంగి లో వరి పంట సాగు చేయకూడదని,తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు.వరి సాగు వల్ల తాగు నీటి ఎద్దడి ఏర్పడే ఆకాశం ఉందన్నారు.వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు,చిరుధాన్యాలు కూరగాయలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందాలని కోరారు.వెటర్నరీ డాక్టర్ సుధా రాణి మాట్లాడుతూ…పశువులకు అవసరమైన మేత అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.పశుగ్రాసం కోసం వివిధ పథకాలు ఉన్నాయని, రైతులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.వివరాల కోసం పశుసంవర్ధక శాఖ వారిని సంప్రదించాలని సూచించారు.గ్రామ సర్పంచ్ తీగల సాయిలు గారు మాట్లాడుతూ… అధికారులు చూపిన సూచనలు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.ఎల్ నినో దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.గృహ అవసరాలకు అందించే విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దురిశెట్టి రమేష్,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ రైతులు పాల్గొన్నారు.

