epaper
Friday, November 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాగార్జునసాగర్‌లో జలదోపిడీకి ప్రభుత్వ సహకారం!

నాగార్జునసాగర్‌లో జలదోపిడీకి ప్రభుత్వ సహకారం!
అనుమతుల్లేకుండానే 9 టీఎంసీల నీటి తరలింపునకు కుట్ర
ఏడాదిగా సొరంగం తవ్వుతున్నా ప్రభుత్వానికి తెలియదా?
తెలంగాణ నీటి హక్కులను తాకట్టు
చంద్రబాబు, మోదీని ప్రసన్నం చేసుకుంటారా?
సాగునీటి సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకంపై సమాధానం చెప్పాలి
కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్‌ అన్యాయమే చేసింది
న్యాయపోరాటం.. ప్రజా ఉద్యమంతో జలదోపిడీని అడ్డుకుంటాం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్‌లో భారీ సొరంగం నిర్మించి తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడీకి పాల్పడే ప్రయత్నం చేస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? తాగునీటి పథకం పేరుతో డెడ్‌ స్టోరేజ్‌ నుంచి 9 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ నీటి తరలింపునకు సహకరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ వద్ద ఏడాదిగా సొరంగం తవ్వుతూ విజయపురి సౌత్‌ వద్ద 510 అడుగుల దిగువ నుంచి నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టు పనులు ఏడాదిగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. 18 గంటలు పనిచేస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదా? నిఘా విభాగం సమాచారం ఇవ్వలేదా? నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు అందించలేదా? అని నిలదీశారు.

తాగునీటి ముసుగులో 9 టీఎంసీల తరలింపు

1,650 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. పేరుకు తాగునీటి పథకమైనా, దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర ఉందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. గతంలో సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడు వద్ద గండి కొట్టి శ్రీశైలం నుంచి నీటిని తరలించారని, ఇప్పుడు నాగార్జునసాగర్‌ వద్ద అదే తరహా ప్రయత్నం జరుగుతోందన్నారు. శ్రీశైలంలో డెడ్‌ స్టోరేజ్‌కు పైన తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న నీరు కేవలం 3.5 టీఎంసీలేనని, అలాంటి పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ నుంచి 9 టీఎంసీలు తరలిస్తే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల తాగునీటి అవసరాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. నల్గొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారికి సలహాదారు పదవా?

ఆదిత్యనాథ్‌ దాస్‌ అనే ఐఏఎస్‌ అధికారిని సాగునీటి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్ర సాగునీటి సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారు? ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారు? అని ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈఎన్‌సీ రమేశ్‌బాబు పదవీ విరమణ అనంతరం ఏడాది పాటు పొడిగించి తిరిగి నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని, ఏపీ చేపడుతున్న నీటి తరలింపును నిలిపివేయాలని బోర్డుకు లేఖ రాశారా లేదా స్పష్టం చేయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల కేటాయింపులపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. కేఆర్ఎంబీలో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, రాష్ట్ర హక్కుల కోసం ప్రభుత్వం తక్షణమే ఫిర్యాదు చేయాలని అన్నారు.

హైదరాబాద్‌లో నీటి కొరత.. ప్రభుత్వంలో భిన్న ప్రకటనలు

హైదరాబాద్‌లో నీటి కొరత ఉందని ముఖ్యమంత్రి చెబుతుంటే, నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం కొరత లేదని ప్రకటించడం ప్రభుత్వ గందరగోళానికి నిదర్శనమని కేటీఆర్‌ విమర్శించారు. అక్టోబర్‌లో నగరంలో సుమారు 2.50 లక్షల వాటర్‌ ట్యాంకర్లు బుక్‌ అయ్యాయని, రోజుకు దాదాపు 8 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి కొరతతో విద్యాసంస్థలు, హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్నా మంత్రి మాత్రం నీటి సమస్య లేదనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. 1930లో నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం వద్ద 161 టీఎంసీల సామర్థ్యంతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధం చేశారని తెలిపారు. ఆ తర్వాత ప్రాజెక్టును నందికొండకు మార్చి నాగార్జునసాగర్‌ నిర్మాణానికి ప్రతిపాదించడం తెలంగాణకు జరిగిన తొలి ద్రోహమన్నారు. నాగార్జునసాగర్‌ ద్వారా తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పినా నేటికీ ఆరు లక్షల ఎకరాలకు మించి అందడం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు 15.5 లక్షల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణకు 28 శాతం, ఏపీకి 72 శాతం ఉందన్నారు. కృష్ణా నది పాలమూరు జిల్లాలో సుమారు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రకారం పాలమూరుకు 174 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా అందించే అవకాశం ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. జూరాల ఆయకట్టు రెండు లక్షల ఎకరాల నుంచి లక్షా పది వేల ఎకరాలకు కుదించారని, ఆర్డీఎస్‌ కింద 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 15 వేల ఎకరాలకే అందుతోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో ఆర్డీఎస్‌ ఆయకట్టును కాపాడిందని గుర్తుచేశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులకు కేసీఆర్‌ హయాంలోనే ఊపిరి

కేసీఆర్‌ నాయకత్వంలో పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి పాలమూరు, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశామని కేటీఆర్‌ తెలిపారు. పాలమూరులో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో వలసలు తగ్గాయని చెప్పారు. 2015 జూన్‌ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, వట్టెం, కరివెన, ఏదుల, ఉద్దండాపూర్‌, నార్లాపూర్‌ రిజర్వాయర్లను పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువలు, పంపిణీ వ్యవస్థ పనులకు సంబంధించిన టెండర్లను రద్దు చేసిందని విమర్శించారు. కృష్ణా నదిలో వచ్చిన సుమారు 250 టీఎంసీల నీటిని వినియోగించకుండా ఏపీకి, సముద్రానికి వదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి హక్కుల విషయంలో మౌనం పాటిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. సాగర్‌లో నీటి తరలింపు ప్రయత్నాలపై తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకునే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఉద్యమ కార్యాచరణ చేపడతామని, కేఆర్ఎంబీకి పార్టీ తరఫున లేఖ రాసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సోనియాను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి!

సోనియాను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి! రాష్ట్ర ఏర్పాటులో సోనియా నిర్ణయాన్ని విస్మరించడం...

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనన్న కాంగ్రెస్‌ నేతలు...

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు! స్థానికత హక్కులు, పదో తరగతి ప్రాధాన్యంపై...

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ 10.75 శాతం వృద్ధితో దేశంలోనే...

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం!

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం! రాజాసింగ్‌, సీబీఐ విచారణ డిమాండ్‌తో తెరపైకి పాత...

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను!

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను! మూడు గవర్నర్‌ కోటా స్థానాల కోసం కాంగ్రెస్‌లో...

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌!

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌! పాంచజన్య పేరుతో రోజూ పచ్చి అబద్ధాలు తెలంగాణ రక్షణ...

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే!

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే! కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మార్పుతో పార్టీలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.