epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర

  • ప్రధాన నిందితుడు వెనుక భారీ శక్తులే ఉన్నాయి
  • కేర‌ళ ప్ర‌భుత్వానికి హైకోర్టు కీల‌క ఆదేశాలు
  • తాత్కాలిక నివేదికను సమర్పించిన సిట్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువులో వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో వేగవంతమైన, కచ్చితమైన దర్యాప్తు జరగాలని సిట్​ను జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌ వి, జస్టిస్‌ కేవీ జయకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మంగళవారం ఈ కేసును సంబంధించిన సిట్​ తన తాత్కాలిక నివేదికను సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పించింది. మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు హైకోర్టు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదు చేయాలని నిర్ణయించింది. దీనిలో ప్రస్తుత పిటిషన్‌లోని ఉన్నికృష్ణన్ పొట్టి, స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ మినహాయించాలని, బదులుగా ప్రభుత్వాన్ని, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, పోలీసులను చేర్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బంగారం దొంగతనం జరిగిన సమయంలో ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, కమిషనర్​ తీసుకున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, ఉన్నికృష్ణన్​ పొట్టికు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేమని తెలిపింది. దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై కూడా తీవ్ర అనుమానాలు ఉన్నాయని చెప్పింది.

అసలు ఏంటీ ఈ వివాదం?

శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.