epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు!

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు!

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : అక్టోబర్ 20 దేశమంతా దసరా పండుగను జరుపుకుంది. మన వరంగల్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో రావణుడి భారీ దిష్టిబొమ్మలను తగలబెట్టి, చెడుపై మంచి సాధించిన విజయంగా సంబరాలు చేసుకున్నాం. అయితే అదే అక్టోబర్ 20న, మనకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో దృశ్యం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదే రావణుడిని దేవుడిగా పూజిస్తూ, పల్లకీలో పెట్టి భుజాలపై మోస్తూ, జేజేలు పలుకుతూ ఊరేగిస్తున్నారు. ఈ వైరుధ్యమే ఇప్పుడు అసలు దసరా అంటే ఏమిటి? మంచి-చెడు అంటే ఏమిటి? అనే లోతైన చర్చకు దారి తీస్తోంది.

మూడు ప్రాంతాల్లో మూడు రూపాలు:
శ్రీలంకలో రావణుడు రాజు, దేవుడు: మనం రాక్షసుడిగా భావించే రావణుడిని శ్రీలంకలో తమ జాతి గౌరవ చిహ్నంగా చూస్తారు. వారి నమ్మకం ప్రకారం రావణుడు గొప్ప శివభక్తుడు, వేద పండితుడు, విమాన శాస్త్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త, తన పరిపాలనలో లంకను బంగారు లంకగా మార్చిన గొప్ప పాలకుడు. శ్రీలంకలో నేటికీ రావణుడికి ప్రత్యేక ఆలయాలు, రావణ ఎల్ల, రావణ గుహలు అనే ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు రావణుడిని దేవుడిగా పూజిస్తారు. మహారాష్ట్ర, మధ్యభారత గిరిజన ప్రాంతాల్లో ఆరాధ్య దైవం: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోని కొడిశాలగూడెం, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లోని గోండు ఆదివాసీలు రావణుడిని తమ పూర్వీకుడిగా భావిస్తారు. గోండు పురాణం ప్రకారం రావణుడు వారి తెగకు చెందిన రాజు. అతను చాలా తెలివైనవాడు, తమ జాతిని కాపాడినవాడు కాబట్టి, వారు ఏటా దసరా రోజున “రావణ్ పెన్” పేరుతో జాతర జరుపుకుంటారు. మనం రావణుడిని కాలుస్తాము, వారు రావణుడికి జేజేలు పలుకుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో రాక్షసుడిగా: మనకు వాల్మీకి రామాయణం ప్రధాన ఆధారం. ఆ రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించిన కారణంగా చెడుకు ప్రతీకగా నిలిచాడు. అందుకే మనం దసరా రోజున రావణ వధ చేసి, చెడుపై మంచి గెలిచినట్లుగా భావిస్తాం.

అసలు దసరా అంటే ఏమిటి? రావణ వధకే పరిమితమా?

పెద్దలు చెప్పిన దసరా అంటే దస్+హర. దస్ అంటే పది, హర అంటే హరించడం, జయించడం. అంటే మనలోని పది ఇంద్రియాలను – ఐదు జ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం), ఐదు కర్మేంద్రియాలు (నోరు, చేతులు, కాళ్ళు, మల, మూత్ర ద్వారాలు) – వీటిని జయించడం. అలాగే మనలోని తమస, రజస, సాత్విక అనే మూడు గుణాలను జయించడం. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లుగా, పది ఇంద్రియాల కోరికల వల్ల మనిషికి కర్మలు చుట్టుకుంటాయి. కర్మలు ఉన్నంత వరకు జనన మరణ చక్రం తప్పదు. ఆ ఇంద్రియాలను జయించి, కర్మలను లేకుండా చేసుకుని దేవునిలో కలిసిపోవడమే మోక్షం. బయట ఉన్న రావణుడి బొమ్మను కాల్చడం కంటే, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు గుణాలను కాల్చడమే నిజమైన దశరా అని పెద్దల ఉద్దేశం.

సీతమ్మ జననంపై మరో కోణం – జానపద కథనం ఏం చెబుతోంది?
వాల్మీకి రామాయణంలో సీతమ్మ భూమి నుండి పుట్టిందని ఉంటుంది. కానీ భారతదేశంలోనే ప్రచారంలో ఉన్న కొన్ని ప్రత్యామ్నాయ రామాయణాల్లో – ముఖ్యంగా జైన రామాయణం, గోండు రామాయణం వంటి జానపద కథనాల్లో – సీతమ్మ రావణుడి కూతురే అనే ప్రస్తావన ఉంది.
ఆ కథనం ప్రకారం..
శ్రీలంక సముద్ర తీరంలో పడవలో దొరికిన ఒక పసిపాపను సైనికులు రావణబ్రహ్మ వద్దకు తీసుకువస్తారు. ఆ పాపను చూసిన రావణుడు, ఆమెను చేరదీసి, సీత అని పేరు పెట్టి, సంతానం లేక షోకిస్తున్న తన శిష్యుడైన జనక మహారాజుకు దత్తత ఇస్తాడు. అందుకే అరణ్యంలో సీతమ్మ కనిపించినప్పుడు ఆమెను అలా చూడలేక తీసుకొచ్చి అశోక వనంలో అల్లారుముద్దుగా, కూతురిలా చూసుకున్నాడని ఆ జానపద కథనాలు చెబుతున్నాయి. ఈ కథనం వాల్మీకి రామాయణానికి పూర్తి భిన్నమైనది. కానీ ఇలాంటి ప్రత్యామ్నాయ కథనాలు ఉండటమే, రావణుడిని ఒకచోట దేవుడిగా, మరోచోట రాక్షసుడిగా చూడటానికి కారణం కావచ్చు. ఒక కథను ఎవరు, ఎక్కడ, ఎలా చెప్పారనే దానిపై ఆధారపడి ఆ వ్యక్తి పాత్ర మారుతుంది.

 

ఆలోచించాల్సిన అవసరం
రావణబ్రహ్మ ద్వాదశ గ్రహాలను శాసించిన మహాజ్ఞాని, నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మణుడు, శివతాండవ స్తోత్రం రాసిన కవి, వీణ వాయించడంలో దిట్ట, ఆయుర్వేద శాస్త్రవేత్త. అంతటి జ్ఞాని ఒకేసారి రాక్షసుడు ఎలా అవుతాడు? ఒక చోట రాజు, ఒక చోట దేవుడు, ఒక చోట రాక్షసుడు ఎలా అవుతాడు? అనేది మనం ఆలోచించాలి. దసరా పండుగ రోజున బయట ఉన్న రావణుడిని కాల్చడం కాదు. మనలో ఉన్న గుణాలను జయించినప్పుడే పండుగకు నిజమైన అర్థం వస్తుంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ!

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ! ఐదు కార్లు, అంబులెన్స్‌ పరస్పరం ఢీకొన్న వైనం పార్టీ కార్యకర్తలు,...

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు! వార్తల ప్రసారంలో నియమావళి ఉల్లంఘనలకు చెక్‌ ఉగ్రవాద...

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా! ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు పాత వీడియోలు,...

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు!

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు! విజయ్‌ పార్టీకి నలుగురు దాతల...

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం!

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం! సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల...

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు భర్త హత్య కేసులో భార్య,...

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు సీఈసీ...

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌!

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌! కుమార్తె సంస్థ చెల్లింపులపై ఎఫ్‌ఐఆర్‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.