epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవ‌రోధాల‌ను అదిగ‌మిస్తాం.. సంక్షేమాన్ని కొన‌సాగిస్తాం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

సంక్షేమాన్ని కొన‌సాగిస్తాం
అవ‌రోధాల‌ను అదిగ‌మిస్తాం
అభివృద్ధి చేసి చూపిస్తాం
ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జా మ‌ద్ద‌తు
ప్ర‌జాపాల‌న‌లో ఆరుగ్యారంటీల‌నుఅమ‌లు చేసి తీరుతాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి


కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : గత ప్రభుత్వ తప్పిదాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస సోమవారం గణపురం మండలం, చెల్పూర్ లో రూ. 5.50 కోట్లు కెటిపిపి సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభిస్తూ జిల్లాలోని గోరి కొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్, చెల్పూర్లో బస్టాండ్ నిర్మాణం కోసం, భూపాలపల్లి యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇల్లు నిర్మాణం లతో పాటు పలు అభివృద్ధి, నిర్మాణాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన గత ప్రభుత్వ తప్పిదాలకు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి రాష్ట్ర సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం మనం చేపట్టే మంచి కార్యక్రమాలకు ఎపుడు దేవుని ఆశీస్సులు ఉంటాయని, అన్ని వేళలా సహకరిస్తారని తెలిపారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం గా ఉండాలని ప్రభుత్వం ఎల్లపుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. దివంగత నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పించారని, ఈ ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని, మహిళలకు మహిళా శక్తి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్ టి సి బస్సులు, పెట్రోల్ బంక్ లు , సోలార్ పవర్ కేంద్రాలు, దాన్యం సేకరణ కేంద్రాలు, మహిళా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలు లాంటి కార్యక్రమాలు ఆడబిడ్డలను ముందు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న 10 నెలలో 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని, రైతు భరోసా 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలుపుతూ ఇంకా రాబోయే రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.సంవత్సరం కాలం నుండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్ళుగా భావించి నడిపిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ యాయంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కొరకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గోరి కొత్తపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని మాత్రులను ఆయన కోరారు. భూ భారతి చట్టంతో 12 సంవత్సరాలు మోకాపై ఉంటే పట్టాలు జారీ చేయు విధము ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనునిత్యం పని చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు బై పాస్ రోడ్డు, మైనింగ్ కళాశాల, పాలి టెక్నీక్ కళాశాల, డిబిఎం 38 కాలువకు రూ.320 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల 44700 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్టీసీ ఎడ్ సలోమం, ఆర్ ఎం విజయ భాను, డిఎం ఇందు,
సింగిల్ విండో చైర్మన్లు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టప్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55...

‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక...

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి...

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..? వేధింపులు...

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్...

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి :...

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.