epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేనేంటో అందరికీ తెలుసు.

  • కాంట్రాక్టు వర్క్ కోసం తాపత్రయం అవసరం లేదు.
  • మేడారం జాతర అభివృద్ధికి రూ. 251 కోట్లతో భారీ ప్రణాళిక.
  • సీతక్క, సురేఖ అక్కలతో కలిసి ముందుకు తీసుకెళ్తాం.
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి కార్యక్రమాలపై వివాదాలు చెలరేగుతున్న తరుణంలో, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార,పౌరసంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నేనేంటో అందరికీ తెలుసు అని, 70 కోట్ల కాంట్రాక్టు వర్క్ కోసం నాకు తాపత్రయం అవసరం లేదు అని, నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు అని, ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సమ్మక్క–సారలమ్మ ఆలయాభివృద్ధి పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. అధికారులతో కలిసి వివిధ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రూ. 251 కోట్లతో అభివృద్ధి పనులు

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా రూ.101 కోట్లను మంజూరు చేశారు అని, వాటిలో రూ.71 కోట్లకు ఇప్పటికే టెండర్లు పిలిచాం అని, గడచిన సంవత్సరాల్లో మంజూరైన రూ.150 కోట్లతో కలిపి మొత్తం రూ.251 కోట్ల విలువైన అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతున్నాయి అని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన జరుగుతాయని, భవిష్యత్తులో ప్రతి జాతరలో ఉపయోగపడే విధంగా రహదారులు, పార్కింగ్, డ్రైనేజ్, మంటపాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మేడారం జాతరకు వచ్చే నిధులు జంపన్న వాగులో వర్షపు నీటిలా జారిపోకుండా, ప్రతి రూపాయి జాతర ప్రాంగణాల అభివృద్ధికే వినియోగిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

అభివృద్ధి పనులు వేగవంతం

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇంకా 50 రోజుల్లో ఈ పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు ఇచ్చాం అని, మంత్రివర్యురాలు సీతక్క స్వయంగా పర్యవేక్షణ చేస్తారు అని, ఎవరు సూచనలు, సలహాలు ఇచ్చినా వాటిని స్వీకరిస్తాం అని చెప్పారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత భక్తుల సౌకర్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. గత జాతరలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుందని మంత్రి పేర్కొన్నారు.

ఆరోపణలకు సమాధానమిస్తూ

మంత్రుల మధ్య టెండర్ల రగడ, ఫిర్యాదులపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ పొంగులేటి స్పందించారు. నాపై ఎవరైనా ఫిర్యాదు చేశారంటే నేను నమ్మను అని, అలాంటి అవకాశం లేదనే నమ్మకం ఉంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మేము అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని,సమ్మక్క–సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో కలిసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం కట్టుబడి ఉంది

మేడారం జాతర అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. ఇది దేశంలో అతిపెద్ద ఆదివాసీ జాతర అని, దీని ప్రతిష్ఠను మరింతగా పెంచే దిశగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేస్తోంది అని, మేడారం అభివృద్ధి ప్రణాళికలో సంస్కృతి, భక్తి, సదుపాయాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, ఎమ్మెల్యేలు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.