epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధర్మేంద్ర కన్నుమూత

ధర్మేంద్ర కన్నుమూత

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం
ముంబయిలోని నివాసంలో తుది శ్వాస
రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని స‌హా ప్రముఖుల నివాళి
సతీమణి హేమమాలిని, కుమార్తె ఇషా దేవోల్‌కు ప‌రామ‌ర్శ‌
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి
పవన్‌ హాన్స్‌ శ్మశానవాటికలో అంత్య‌క్రియ‌లు
హాజ‌రైన అమితాబ్‌, అమీర్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ త‌దిత‌రులు
300ల‌కు పైగా సినిమాలు.. లెజెండ‌రీ యాక్ట‌ర్‌గా గుర్తింపు
2012లో పద్మ భూషణ్​ అవార్డు
చివరి సినిమా తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా..

కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. ధర్మేంద్ర మృతి పట్లు ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ‘మిస్ యూ సర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ‘ఓ యుగం ముగిసింది’ అని సుదీర్ధ పోస్టు షేర్ చేశారు. కాగా, ఇటీవల ఆనారోగ్యం కారణంగా ధర్మేంద్రను కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రిలో చేర్పించారు. రీసెంట్​గా ఈనెల 10న మరోసారి హాస్పిటల్​లో చేరడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించిందని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన డిశ్చార్చి అయ్యారు. ఇంటి నుంచే చికిత్స అందించారు. ఈక్రమంలో మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం కన్నుమూశారు.

ముంబయిలో అంత్యక్రియలు

ధర్మేంద్ర ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని అంత్యక్రియలకు ముంబయిలోని పవన్‌ హాన్స్‌ శ్మశానవాటికలో ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ధర్మేంద్ర పార్దీవదేహాన్ని అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తరలించారు. ధర్మేంద్ర సతీమణి హేమమాలిని కుమార్తె ఇషా దేవోల్, బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఇతర ప్రముఖులు శ్మశానవాటిక లోపలికి వెళ్లి అంతిమ వీడ్కోలు పలికారు.

300 సినిమాలు

1935లో డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’తో నటుడిగా అరంగేట్రం చేశారు. అలా దాదాపు 60ఏళ్లకు పైగా భారతీయ సినిమాలో ధర్మేంద్ర ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన కెరీర్​లో 300+ సినిమాల్లో నటించి లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందారు. 1997లో ధర్మేంగ్ర ఫిల్మ్​ఫేర్ అచీవ్​మెంట్ అవార్జ్ అందుకోగా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆయనను పద్మ భూషణ్​ అవార్డుతో సత్కరించింది.

‘ఇక్కీస్‌’ మూవీలో కనిపించనున్న ధర్మేంద్ర!

ధర్మేంద్ర చివరిసారిగా ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’లో షాహిద్ కపుర్​, కృతి సనన్‌లతో కనిపించారు. అందులో షాహిద్ తాతగా నటించారు. అంతేకాకుండా రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన బ్లాక్ బస్టర్ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కూడా ఆయన నటించారు. ఈ నటుడు తదుపరి శ్రీరామ్ రాఘవన్ ‘ఇక్కీస్‌’లో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్​ 25న విడుదల కానుంది. చిన్నవయసులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్​ లెఫ్టినెంట్​ అరుణ్​ ఖేతర్​పాల్​ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ధర్మేంద్ర అరుణ్​ తండ్రిగా కనపడనున్నారు.

ఒక శ‌కం ముగిసింది

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ప్రముఖ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్రతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని రాష్ట్రపకి ముర్ము పోస్ట్​ చేశారు. ‘ధర్మేంద్ర గారి మృతితో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసింది. ఆయన ఒక దిగ్గజ సినీ వ్యక్తిత్వం. ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఆకర్షణ తెచ్చిన అద్భుతమైన నటుడు. ఆయన విభిన్న పాత్రలను పోషించిన విధానం లెక్కలేనన్ని మందిని ఆకట్టుకుంది. ధర్మేంద్ర జీ తన సరళత, వినయం, ఆప్యాయతకు సమానంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మోదీ ఎక్స్​ వేదికగా పోస్ట్ షేర్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.