epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏసిబి అధికారి వేషం వేసి దందా..

న‌కిలీ ఏసీబీ అధికారి అరెస్టు
ప్ర‌ధాన నిందితుడి రాచంప‌ల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో 50 కేసులు
2002 నుంచి దొంగ‌త‌నాలు, చైన్ స్నాచింగ్‌, దోపిడీ కేసులు
కొన్నేళ్లుగా ఏసీబీ డీఎస్పీగా చెలామ‌ని అవుతూ అధికారుల‌కు బెదిరింపులు
కేసు నుంచి త‌ప్పించాలంటే డ‌బ్బులివ్వాల‌ని డిమాండ్‌
మొత్తం 9మందితో ముఠాగా ఏర్ప‌డి నేరాలు
వ‌రంగ‌ల్ ఆర్టీఏ అధికారి ఫిర్యాదుతో వ‌రంగ‌ల్ పోలీసుల వేట‌
ఎట్ట‌కేల‌కు చిక్కిన గ‌జ దొంగ‌.. ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురి అరెస్టు
బ‌య‌ట‌ప‌డిన 20 ఏళ్ల నేర చ‌రిత్ర‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏసీబీ అధికారిగా చెలామ‌ణి అవుతూ.. అధికారుల నుంచి డ‌బ్బులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న రాంచ‌ప‌ల్లి శ్రీనివాస్‌తో పాటు మ‌రో న‌లుగురిని సోమ‌వారం వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ వ‌ల‌కు రాచంప‌ల్లి ముఠాలోని ఐదుగురు చిక్క‌గా.. మ‌రో న‌లుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను (45 సం., పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్). అతనితో కలిసి నవీన్ జేఆర్ (కర్ణాటక), మంగళ రవీందర్ (బెంగుళూరు), మురళి (బెంగుళూరు), ఎస్‌.ఎన్‌. ప్రసన్న (బెంగుళూరు) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమద్ది వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సీనియర్ అధికారులను టార్గెట్ చేసుకుని, మీ మీద అవినీతి కేసు నమోదైంది, బయటపడాలంటే డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఏబీబీ డీఎస్పీగా చెలామ‌ణి అవుతూ బెదిరింపులకు పాల్పడేవాడ‌ని అన్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆర్టీఏలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డి నుంచి వివిధ మార్గాల్లో 10 లక్షల రూపాయలు దోచుకున్న‌ట్లు తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నికల్ సాక్ష్యాలను సేకరించి.. టెక్నాల‌జీ సాయంతో ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో రాచంప‌ల్లి శ్రీనివాస్ నేరాల‌న్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శ్రీనివాస్ నేర చరిత్ర 2002లో ద్విచక్ర వాహన దొంగతనాలతో ప్రారంభమైంద‌ని, ఆ తర్వాత నకిలీ పోలీస్ అధికారిగా రాయలసీమలో నేరాలకు పాల్పడి, దొంగల కుటుంబాలను బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం వంటి కేసుల్లో పాల్గొన్న‌ట్లు తెలిపారు. మొత్తం 50కిపైగా కేసులు అతని పేరుతో నమైద‌న‌ట్లు తెలిపారు. జైలు శిక్షలు అనుభవించినా, బయటికి వచ్చిన తర్వాత మళ్లీ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 41 చైన్ స్నాచింగ్స్ కు పాల్పడిన‌ట్లు తెలిపారు. నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తిన తరువాత ఇప్పటివరకు 19 కేసులు, రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేశాడ‌ని తెలిపారు. తెలంగాణలో 9 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. అందులో 8 కేసుల్లో అరెస్టయ్యాడు. 11 కేసుల్లో పోలీసులకు చిక్క‌కుండా తిరుగుతున్నాడు. దోచిన డబ్బును నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్, గోవా కాసినోలు, బెంగుళూరు-గోవా వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ ఎన్‌.శుభం ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్, ఇన్‌స్పెక్ట‌ర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్‌ఐలు ఎస్‌. మహేష్, ఎం. సురేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.