epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’
కవిత నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా విస్తరిస్తున్న తెలంగాణ జాగృతి
*జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్

కాకతీయ, కరీంనగర్ : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన వేదికగా మారిందని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కవితక్క ‘జనం బాట’ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఐడీపీఎల్ భూముల అంశంపై కవితక్క లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత రెండు నెలలుగా 11 జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల గోడును వింటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ తెలంగాణ జాగృతి ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ జాగృతిని బలోపేతం చేస్తున్న ఈ ఉద్యమాన్ని కొంతమంది స్వార్థపరులు, కబ్జాకోరులు తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలను జాగృతి కరీంనగర్ జిల్లా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ సాధించాలనే లక్ష్యంతో కవితక్క ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, అది ఓర్వలేక కొంతమంది నాయకులు పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని బీజేపీని కూడా కవిత ప్రజల ముందు ప్రశ్నిస్తున్నారని స్పష్టం చేశారు. జనం బాటకు వస్తున్న ప్రజల స్పందన చూస్తుంటే తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మారుస్తూ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల్లో ఈ ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనమన్నారు. కవితపై అసత్య ప్రచారం, అనవసర విమర్శలు చేస్తే జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాగృతి జిల్లా నాయకులు బూడిగ పరుశురాం గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా నాయకులు కొత్తూరి రఘు, జిల్లా నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.