epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన
మహిళలను కించపరిచిన వారు భూస్థాపితం
రేవంత్ మాటలే ఆయన స్థాయిని బయటపెడుతున్నాయి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సన్మాన సభ వేదికగా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించి, పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా పాలన అందించిన కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తన మాటలతోనే ప్రజల్లో తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. నువ్వు సీఎం వా? చిల్లరగానివా? అన్న స్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డే అన్నారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరిగి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. పది శాతం పనులు కూడా పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమిదని కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించారు.

మహిళలపై వ్యాఖ్యలతో అసలు స్వరూపం

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించిన సుంకే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో మహిళల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళలను కించపరిచిన వారు చరిత్రలో భూస్థాపితం అయ్యారని దుర్యోధనుడు, రావణాసురుల ఉదాహరణలు ఇచ్చారు. 2029లో రేవంత్ రెడ్డిని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

హామీల అమలులో వైఫల్యం

నవంబర్‌లో వేయాల్సిన రైతుబంధు, డిసెంబర్‌లో వేయాల్సిన రైతుబంధు ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, పెన్షన్‌ను రూ.4 వేలుగా చేస్తామన్న హామీలు నెరవేర్చలేదని, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమిదని మండిపడ్డారు. సీఎం మాటలపై నియంత్రణ కోసం ఐఏఎస్ అధికారులే రేవంత్ రెడ్డికి మంచి భాష నేర్పించాలని, అవసరమైతే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని కాంగ్రెస్ నేతలే కోరే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మేము తిట్టడం మొదలుపెడితే హుస్సేన్ సాగర్‌లో బండగట్టుకుని దూకాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు సమావేశంలో సంచలనం సృష్టించాయి. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వి నాయకులు చుక్క శ్రీనివాస్, బొంకురి మోహన్, మాచర్ల వినయ్, నవీన్ రావు, మామిడి తిరుపతి, పూడూరి మల్లేశం, తౌటు మురళి, వెంకట రమణారెడ్డి, ఆకుల మధుసూదన్, రాజేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, చుక్కారెడ్డి, గడ్డం స్వామి, కొత్త గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.