epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ

డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ
25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి అంగరంగ వైభవం
850 మంది విద్యార్థుల క్రమశిక్షణాయుత మార్చ్‌పాస్ట్ ఆకర్షణ

కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులపూర్ గ్రామంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించగా, నిర్వహించిన కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు 850 మంది విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల క్రమబద్ధత, శాసనబద్ధ నడకను చూసి అతిథులు ప్రశంసలు కురిపించారు.

25 ఏళ్ల విజయవంతమైన ప్రయాణం

అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దయ్యాల సదయ్య మాట్లాడుతూ, పాఠశాల స్థాపన నుంచి ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను వివరించారు. 2001లో 190 మంది విద్యార్థులతో ప్రారంభమైన డిస్నీల్యాండ్ హై స్కూల్ నేడు 850 మంది విద్యార్థులతో 25 ఏళ్ల విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు. విద్యలో నాణ్యత, క్రమశిక్షణే పాఠశాల ప్రధాన బలమని పేర్కొన్నారు.

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ సి. సతీష్ బాబు, హనుమకొండ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి బొక్క సంజీవరెడ్డి, తిరుపతి డీఎస్పీ (అసెంబ్లీ, హైదరాబాద్) ఎల్. రాజేష్, దామెర మండల విద్యాధికారి కె. అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ దామెర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీ నివాసం డైరెక్టర్లు బి. శోభారాణి, డి. రాకేష్ భాను, డి. దినేష్ చందర్, కుటుంబ సభ్యులు డా. పవన్, విజయలక్ష్మి, మౌనిక, కావ్య, మీనా, శ్రీలత, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.