epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక

ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక
చిలకలగుట్ట పవిత్రత కాపాడటం అందరి బాధ్యత
పూజారులు–ఆదివాసీ సంఘాల మ‌ధ్య సమన్వయం అవసరం
జాతర విజయానికి ప్రత్యేక పాలసీ
భక్తుల సౌకర్యాలపైన ప్ర‌భుత్వం దృష్టి
500 మందితో సేవా బృందం ఏర్పాటు : మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని, పూజారులు–ఆదివాసి సంఘాలు–అధికారుల సమన్వయంతోనే జాతరను విజయవంతం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్‌లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసి సంఘాల నాయకులతో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశం నిర్వహించారు.

ఆదివాసీల పాత్ర కీలకం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… జాతర నిర్వహణలో పూజారులు, ఆదివాసి సంఘాల సహకారం కీలకమని తెలిపారు. జాతర నిర్వహణపై తమ సూచనలు, అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలని సంఘాల నాయకులను కోరారు. సమావేశంలో వివిధ ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ… ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు రాజ్యాంగబద్ధంగా, గిరిజన హక్కులకు అనుగుణంగా కొనసాగేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు సేవలందించేందుకు 500 మంది ఆదివాసీ యువకులతో ప్రత్యేక సేవా బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.

సమన్వయంతో జాతర విజయం
అనంతరం మంత్రి సీతక్క స్పందిస్తూ… పూజారులు, ఆదివాసి సంఘాల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని వారి సమన్వయంతో జాతరను విజయవంతం చేస్తామని తెలిపారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి అనుగుణంగా మేడారం ఆలయ ప్రాంగణం తరతరాలకు గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ వారసులుగా గిరిజనులకు తగిన గుర్తింపు కల్పిస్తామని, ఆదివాసి సంఘాలు తమ సభ్యుల వివరాలను అధికారులకు అందించాలని సూచించారు.

భక్తుల సౌకర్యాలపై దృష్టి

చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకువచ్చే సమయంలో ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వాలంటరీ సేవల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దర్శనానికి ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.