epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!
ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!!
వెన‌క్కి త‌గ్గ‌ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం..
ముందు ఎస్సైని వీఆర్ చేస్తూ ఉత్త‌ర్వులు
పొలిటిక‌ల్ పైర‌వీ త‌ర్వాత‌..స‌స్పెన్ష‌న్ వేటు
ఇసుక దందాలో వ‌సూళ్లు చేస్తున్న‌ట్లుగా ఎస్సైపై సీపీకి ఫిర్యాదులు
డిపార్ట్‌మెంట‌ల్ ఎంక్వయిరీ త‌ర్వాత చ‌ర్య‌లు
సీపీని త‌ప్పుబ‌డుతూ.. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
ప్రొసిజ‌ర్ ఫాలోయిన‌ట్లుగా ఉన్న‌తాధికారుల‌కు వివ‌ర‌ణ‌
సీపీకే స‌పోర్ట్ చేసిన ఉన్న‌తాధికారులు..
వ్య‌క్తిగ‌త పనుల‌పై సెల‌వులో సీపీ… రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో సెల‌వు పెట్టుకున్న‌ట్లుగా పుకార్లు
వాస్త‌వానికి గ‌త నెల‌లోనే సీపీకి సెల‌వులు ఖ‌రారుచేసిన ఉన్న‌తాధికారులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అక్ర‌మాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఓ ఎస్సైని క‌రీంన‌గ‌ర్ సీపీ స‌స్పెన్ష‌న్ చేయ‌డం ఇప్పుడు అధికార‌పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జీర్ణించుకోలేక‌పోతున్నాడంట‌. అధికారానంత క‌వ్వంపెట్టి సీపీ చిలికేశాడన్న‌ట్లుగా స‌ద‌రు ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. లోయ‌ర్ ట్యాంక‌డ్ బండ్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హించిన ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌పై పోలీస్ క‌మిష‌న‌ర్‌కు స్వ‌యంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అంద‌డంతో విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భించ‌డంతో ఈ మేర‌కు స‌ద‌రు ఎస్సైని ముందుగా క‌మిష‌న‌రేట్‌లో రిజ‌ర్వుడ్ చేశారు. అయితే ఈ విష‌యంలో త‌న‌కు తెలియ‌కుండా ఎస్సైపై చ‌ర్య‌లు తీసుకోక‌వ‌డ‌మేంటి…? అంటూ స‌ద‌రు ఎమ్మెల్యే సీపీతో ప‌రోక్షంగా వైరం మొద‌లుపెట్టాడ‌న్న చ‌ర్చ ఇప్పుడు పోలీసు వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. అంతేకాదు…వెంట‌నే స‌ద‌రు ఎస్సైని సేమ్‌పోస్టుకు పంపాల‌ని హుకుంకూడా జారీ చేసిన‌ట్లుగా తెలిసింది. ఈ విష‌యంలో సీపీపై డీజీపీకిసైతం ఫిర్యాదు చేసిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. అయితే అదేస‌మ‌యంలో ఎస్సైపై వ‌చ్చిన ఫిర్యాదులు, అధికారులకు సమ‌ర్పించిన నివేదిక‌లు.. వారి ఆదేశాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లుగా సీపీ సైతం ఉన్న‌తాధికారుల‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం.

అస‌లేం జ‌రిగిందంటే..!
క‌రీంన‌గ‌ర్ జిల్లాకేంద్రానికి అత్యంత‌స‌మీపంలోని ఓ ఇసుక క్వారీ నుంచి ఎస్సై వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా సీపీ గౌస్ ఆలంకు ఫిర్యాదులు అందిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఉన్న‌తాధికారుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా..త‌నిఖీలు చేప‌ట్ట‌డం, ఓవ‌ర్ లోడ్ పేరుతో లారీ డ్రైవ‌ర్ల నుంచి వ‌సూళ్లకు పాల్ప‌డిన‌ట్లుగా.. ఇలా అనేకానేక ఆరోప‌ణ‌లు అందిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో ఎస్సైపై డిపార్ట్‌మెంట‌ల్ ఎంక్వ‌రీ అనంత‌రం.. సీపీఉన్న‌తాధికారుల దృష్టికి విష‌యాన్ని తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ విష‌యంలో ఉన్న‌తాధికారుల ఆదేశాల‌కు అనుగుణంగా ముందు వీఆర్ చేయ‌డం… ఆ త‌ర్వాత స‌స్పెన్ష‌న్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

క‌వ్వంపెట్టి..చిలికిన‌ట్లు..!

ఎస్సైని కాపాడేందుకు ఎమ్మెల్యే చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో ఇప్పుడు ఈవిష‌యాన్ని ఎమ్మెల్యే ,ఆయ‌న అనుచ‌రులు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు ఎస్సైని తిరిగి అదే స్టేష‌న్‌కు ఎస్సైగా తీసుకొచ్చి కూర్చోబెడుతామంటూ స‌వాళ్ల‌తో కూడిన శ‌ప‌థాలు చేస్తుండ‌టం ఇప్పుడు అటురాజ‌కీయ వ‌ర్గాల్లో, ఇటుపోలీసు వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే స‌మ‌యంలో ఒక ఎస్సై కోసం ఎమ్మెల్యే స్థాయి నేత ఎందుకంత ప‌ట్టుబ‌డుతున్నాడు అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో సీపీ గౌస్ ఆలం కూడా వెన‌క్కిత‌గ్గేప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు.నిర్ణ‌యాలు నా చేతుల్లో ఉండ‌వు..యాస్ ప‌ర్ ప్రొసిజ‌ర్ అంటూనే.. డ్యూటీలో నో కాంప్ర‌మైజ్ అంటూ క్లియ‌ర్ క‌ట్ డెసిష‌న్‌ను వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది.

సీపీలో లీవులో వెళ్తే.. పుకార్లు షికార్లు..!

ముంద‌స్తుగానే ఖ‌రారైన లీవులో సీపీ గౌస్ ఆలం సెల‌వుల్లో వెళ్ల‌డంపై ఇప్పుడు రాజ‌కీయంగా రంగు పులుముకుంటోంది. ఇప్పుడు ఎస్సైపై చ‌ర్య‌లు తీసుకున్న కొద్ది రోజుల‌కే సీపీ గౌస్ ఆలం..లీవులో వెళ్ల‌డంపై రాజ‌కీయ రంగు పులుముకోవ‌డ‌మే కాదు.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే సీపీ గౌస్ ఆలం లీవులోవెళ్లారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని పోలీసు వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఈవిష‌యంలో కాక‌తీయ‌కు కూడా అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ద్వారా స్ప‌ష్ట‌మైన స‌మాచారం అందింది. డిసెంబర్‌లోనే సీపీ సెలవుల షెడ్యూల్ ఖరారుకావ‌డం గ‌మ‌నార్హం. జనవరి 11 నుంచి 18 వరకు ముందే ఉన్న‌తాధికారుల నుంచి సీపీ అనుమ‌తి తీసుకున్నారు. ఆ మేర‌కు ఆయ‌న‌సెల‌వులోఉన్నారు. అయితే సెల‌వుకుముందుజ‌రిగిన ఎస్సై స‌స్పెన్ష‌న్‌, అధికార పార్టీ ఎమ్మెల్యేతో జ‌రిగిన ఎపిసోడ్‌.. త‌ర్వాత ఇప్పుడు సీపీపై ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా ఫేక్ ప్ర‌చారమంటూ పోలీసు వ‌ర్గాలు తెలుపుతుండ‌టం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.