epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం!
ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు
కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక సౌకర్యాలు
తాగునీరు, మరుగుదొడ్ల కొరతపై భ‌క్తుల ఆగ్రహం
ఇబ్బందుల నడుమ కూడా అమ్మవార్ల దర్శనంతో పరవశం

కాకతీయ, ములుగు ప్రతినిధి : సంక్రాంతి పండుగ ముగియగానే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. సెలవులు ముగిసినప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దల వైపు సాగారు. తమ కోరికలు తీరాలనే ఆకాంక్షతో “కొంగు బంగారం”గా ప్రసిద్ధిగాంచిన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలకు వడి బియ్యం, బంగారం, చీరలు, సారెలు, పసుపు–కుంకుమ, కొబ్బరికాయలతో నైవేద్యాలు సమర్పించారు. అమ్మవార్ల కృపతో కుటుంబాలు సుఖశాంతులతో, పిల్లాపాపలు పాడిపంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. మొక్కులు చెల్లించిన అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుంటూ జాతర ఆనందాన్ని ఆస్వాదించారు. చిన్నారులు అడవీ ప్రాంతంలో ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు. పెద్దలు అమ్మవార్ల కథలను, జాతర విశిష్టతను పిల్లలకు వివరిస్తూ సంప్రదాయాన్ని తరతరాలకు అందించారు. ఈ విధంగా మేడారం మహాజాతర ప్రతి కుటుంబానికి మరపురాని అనుభూతిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం విశేషం.

కనిపించని సౌకర్యాలు.. భక్తుల అవస్థలు

భక్తుల రద్దీ పెరిగిన మేరకు సౌకర్యాలు అందకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. జంపన్న వాగు, గద్దల పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు జాతర సమయానికి అందుబాటులోకి రాకుండా తాడులతో కట్టివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఆరుబయటే మలమూత్రాలు చేయాల్సి రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆపరేటర్ ట్యాప్స్‌లో నీరు లేకపోవడంతో భక్తులు చేతిపంపులపైనే ఆధారపడ్డారు. తెచ్చుకున్న నీటిని పరస్పరం పంచుకుంటూ నీటి ఎద్దడిని తట్టుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పించినప్పటికీ, జాతర సమయంలోనే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు మరింత సమర్థంగా అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అన్ని ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనంతో పరవశించి, మేడారం మహాజాతరను జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మలుచుకుని ఆనందంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.