epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క

లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క
అగ్రం ప‌హాడ్‌కు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం
గాల్లోకి కాల్పులు జ‌రిపిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

కాకతీయ, ఆత్మకూరు : కొంగుబంగారమైన వనదేవత సమ్మక్క ఆగమనంతో అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతర భక్తి పారవశ్యంతో ఉప్పొంగింది. తెలంగాణలోనే ‘రెండో మేడారం’గా పేరొందిన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లో జాతర వేళ జనసంద్రం వెల్లువెత్తింది. జిల్లాలకే కాదు.. రాష్ట్రాలు దాటి కుటుంబ సమేతంగా భక్తులు తరలిరావడంతో గ్రామం జనారణ్యంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో వనదేవతలను దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడిపంటలు కలుగుతాయన్న అపార విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. “శరణు శరణు సమ్మక్కమ్మా” అంటూ నామస్మరణతో అగ్రంపహాడ్ పరిసరాలు మార్మోగాయి.

లాంఛనాల మధ్య సమ్మక్క రాక

జాతరలో కీలక ఘట్టంగా సమ్మక్క గద్దెపైకి చేరుకునే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. సంప్రదాయ ప్రకారం డీసీపీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఘన స్వాగతం పలికారు. పూజారులు ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించగా, భారీ పోలీస్ బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క రాక వార్తతో భక్తులు ఒక్కసారిగా ముందుకు కదిలారు. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, కొబ్బరికాయలు, పూలు చల్లుతూ అమ్మవారిని వేడుకున్నారు. లక్షలాది మంది ఒకేసారి కదలడంతో కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. పూజారులను తాకేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. చివరకు అధికారులు, పోలీసుల సమన్వయంతో సమ్మక్కను సురక్షితంగా గద్దెపైకి చేర్చారు.

భక్తి.. వ్యాపారం.. ఆందోళనలు

భారీ రద్దీ నేపథ్యంలో కొబ్బరికాయలు, బంగారం ధరలు అమాంతం పెరిగాయి. కొందరు వ్యాపారులు అవకాశంగా తీసుకుని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతర ప్రాంగణంలో గుడుంబా, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లిస్తూ భక్తులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంలా మారి, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.