epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మున్సిపల్ క్లైమాక్స్…

మున్సిపల్ క్లైమాక్స్…
రేపు పీఠాల పోరు!
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధం
హంగ్ ఉన్న చోట్ల ఉత్కంఠ… స్వతంత్రులే కింగ్‌మేకర్లు
ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
మధ్యాహ్నం 12:30కు ప్రత్యేక సమావేశంలో ఎన్నిక
జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేటలో టెన్షన్
క్యాంపు రాజకీయాలతో సభ్యులను కాపాడుకునే ప్రయత్నాలు

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు రేపు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్నికైన కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలతో మున్సిపల్ రాజకీయాలకు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 7 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలం బలంగా ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో ఈ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

నాలుగు చోట్ల హంగ్… ఉత్కంఠ రేపుతున్న పీఠాల పోరు

జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొనడంతో చైర్‌పర్సన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సీపీఎం 1, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 16 ఓట్ల కోసం స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, చైర్‌పర్సన్ పదవిపై పార్టీ అంతర్గత పోటీ నెలకొంది. నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్‌లోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

క్యాంపు రాజకీయాలు… సభ్యులపై పార్టీల నిఘా

హంగ్ పరిస్థితులు నెలకొన్న మున్సిపాలిటీల్లో సభ్యుల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కౌన్సిలర్లను రహస్య ప్రదేశాలకు తరలించి, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిటెడ్ అధికారులను ప్రిజైడింగ్ అధికారులుగా నియమించింది. కోరం పూర్తి అయిన తర్వాతే ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పీఠాల కోసం రేపు జరగనున్న ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారాయి. ముఖ్యంగా హంగ్ ఉన్న మున్సిపాలిటీల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగనున్న నేపథ్యంలో చైర్‌పర్సన్ పీఠం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.