epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉత్కంఠకు తెర

ఉత్కంఠకు తెర
ములుగు మున్సిపల్ చైర్మన్‌గా చంద్రకళ
సీనియార్టీకి గౌరవం… మంత్రి సీతక్క నిర్ణయంతో పీఠంపైకి చంద్రకళ
ఉత్కంఠ పోరులో ఆశావహులను అధిగమించి చైర్మన్‌గా ఎన్నిక
30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి లభించిన అరుదైన గుర్తింపు
వైస్ చైర్మన్‌గా రియాజ్ మీర్జా ప్రమాణ స్వీకారం

కాకతీయ, ములుగు ప్రతినిధి : మున్సిపల్ రాజకీయాల్లో రోజుల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర పోటీ, అంతర్గత చర్చలు, సమీకరణాల మధ్య చింతనిప్పుల చంద్రకళ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పార్టీలో పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, చివరకు సీనియార్టీ, అనుభవానికి ప్రాధాన్యం ఇస్తూ చంద్రకళను చైర్మన్ పీఠానికి ఎంపిక చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చైర్మన్ పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న వాదన ఒకవైపు ఉండగా, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేసిన సీనియర్ నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం మరోవైపు బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క కీలకంగా వ్యవహరించి, సీనియార్టీ, విశ్వసనీయత, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని చంద్రకళ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చింతనిప్పుల చంద్రకళ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. స్థానికంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు, వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు, ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడం వంటి అంశాలు ఆమెకు ఈ పదవి దక్కడంలో కీలకంగా మారాయి. ఈ చైర్మన్ పదవి ఆమె రాజకీయ జీవితంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

వైస్ చైర్మన్‌గా రియాజ్ మీర్జా

చైర్మన్ ఎన్నిక అనంతరం జరిగిన ప్రక్రియలో రియాజ్ మీర్జా మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తూ చింతనిప్పుల చంద్రకళను ఎంపిక చేయడం పార్టీలోనూ, స్థానిక రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.