epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెట్‌లాండ్స్ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం

వెట్‌లాండ్స్ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం
పెండింగ్ నివేదికలు వెంటనే ఇవ్వాలి
ముసలమ్మ కుంట, వెంకటాపూర్ పెద్ద చెరువు వివరాలు ఆలస్యం ఎందుకు?
శాఖల సమన్వయం లేకపోతే చర్యలు తప్పవు
జియో మ్యాపులు, భూ రికార్డులు తక్షణం సమర్పించాలి
స‌మీక్ష‌లో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద సీరియ‌స్‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో చిత్తడి నేలల పరిరక్షణ అంశంపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక నివేదికలను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షతన సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లా అటవీ శాఖ అధికారి అనూస్ అగర్వాల్ (మెంబర్ కన్వీనర్) గత సమావేశం అనంతరం జరిగిన పురోగతిని వివరించారు. జిల్లాలో గుర్తించిన ముఖ్యమైన వెట్‌లాండ్స్ — వరంగల్ రేంజ్ పరిధిలోని ముసలమ్మ కుంట, నర్సంపేట రేంజ్‌లోని వెంకటాపూర్ పెద్ద చెరువులకు సంబంధించిన పలు కీలక నివేదికలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల నుంచి అవసరమైన సమాచారం అందాల్సి ఉందని తెలిపారు.

కీలక నివేదికలు తక్షణం సమర్పించాలి

వెట్‌లాండ్స్‌కు సంబంధించిన గూగుల్ జియో-రిఫరెన్స్ సరిహద్దు మ్యాపులు, భూ రికార్డులు (పహాని/భూ భారతి), సర్వే నంబర్ వారీగా విస్తీర్ణ వివరాలు, ఎఫ్‌టీఎల్ సరిహద్దు మ్యాపులు, ప్రభావ పరిధి మ్యాపులు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సరస్సుల సాంకేతిక వివరాలు — లోతు, ఎత్తు, పీహెచ్ స్థాయి, నీటి ఉప్పుదనం వంటి అంశాలపై పూర్తి సమాచారం సమర్పించాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత శాఖల సమ్మతి పత్రాలు, సాంకేతిక నివేదికలు ఆలస్యం లేకుండా అందించాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి, పూర్తి స్థాయి నివేదికలను సమయపాలనతో అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

సమన్వయం లేకపోతే పరిరక్షణ సాధ్యం కాదు

చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వెట్‌లాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, అటవీ, రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.