epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు
మానకొండూరులో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ అవగాహన సదస్సు

కాకతీయ, కరీంనగర్ : బాలల హక్కులను ఉల్లంఘించే చర్యలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, బాలల రక్షణకు న్యాయవ్యవస్థ అజేయ కవచంలా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. మానకొండూరులోని పీఎంస్రీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విద్యార్థులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని వివరించారు. బాలలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల ముప్పు నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, యస్‌వీఆర్ కృష్ణ, బలుసుల శాంతి కుమార్, తిరుమణి అశ్విని, కొత్తకొండ శంకర్, దుంపేటి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు దాసి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఉపాధ్యాయులు దీపారాణి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలకు న్యాయవాదులు సమాధానాలు ఇవ్వగా, ఈ సదస్సు వారిలో చట్టపరమైన అవగాహన పెంపొందించిందని ఉపాధ్యాయులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.