epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం?

ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం!
బోర్డు తిప్పేసిన గాయత్రి ట్రేడర్స్ యజమాని!
ఐపీ పెట్టినట్లు అనధికారిక సమాచారం

కాకతీయ, వరంగల్ : వరంగల్ లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో గాయత్రి ట్రేడర్స్ పేరిట లడే తిరుపతి అనే వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా తిరుపతి మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంట్లో భార్యను వదిలేసి ఒక్కడే వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెను అడిగితే నీకేమి తెలియదు అని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తిరుపతి డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ. 5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయనే స్వచ్ఛందంగా మార్కెట్లోకి వస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా.. విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా.. వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు.. ఈ విషయంపై దృష్టిసారించి.. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ వ్యాపారి ఐదేళ్ల క్రితం జమ్మికుంటలో కూడా మోసం చేసి ఐపీ పెట్టీ ఉడాయించినట్లు తెలుస్తోంది. అక్కడినుండి వరంగల్ కు వచ్చిన తిరుపతి గాయత్రి ట్రేడర్స్ తో వ్యాపారం కొనసాగించాడు. అడ్తీ వ్యాపారులను మచ్చిగ చేసుకున్నాడు. అడ్తీ దారుల వద్ద భారీగా మిర్చిని కొనుగోలు చేసి ఇక్కడే అమ్ముకొని సోమ్ము చేసుకొని పక్క ప్లాన్ తో పారిపోయినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.