epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు తప్పవు
న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ,ఖానాపూర్ : రాష్ట్రంలో మక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారి కష్టాలను పట్టించుకోకుండా రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఈ యాసంగి సీజన్‌లో 70 వేల ఎకరాలకు పైగా మక్కజొన్న సాగు జరిగినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. మద్దతు ధర 2400 ప్రకటించి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చివరికి వారిని 1700–1800కే మక్కలు అమ్ముకునే పరిస్థితికి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రైతుకైనా చెల్లింపులు చేయలేదని విమర్శించారు.

రైతుల కష్టాలపై స్పందన లేదు

పాకాల ఆయకట్టు కింద వరి పంటలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కళ్లెదుట జరుగుతున్న రైతుల కష్టాలపై స్పందించకపోవడం దారుణమన్నారు. సరస్సులో నీళ్లు ఉన్నా రైతులకు అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, మండల కేంద్రాల్లో మాత్రమే కేంద్రాలు పెట్టి గ్రామీణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ వెంటనే అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రలేచి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడి ఆందోళనలు, ధర్నాలు చేపడుతుందని, ఆ పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కఠినంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.