నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
కాకతీయ, గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామి వారికి పంచామృతాభిషేకాలు,వేద మంత్రోచ్ఛరణల నడుమ విశేష పూజలు నిర్వహించారు.అనంతరం మల్లె పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించగా,ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది.పూజల అనంతరం హారతులు ఇచ్చి,తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.భక్తులు స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష,ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

