సైకిల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం
అధ్యక్ష, కార్యదర్శులుగా ఉప్పుల రాజు, కన్నబోయిన నిశాంత్ యాదవ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎలక్షన్స్ ఓ సి టి స్టేడియం లో ఆదివారం రోజున జరిగినాయి. ఈ జనరల్ బాడీ మీటింగ్ నందు తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నబోయిన సారయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఉప్పుల రాజు కార్యదర్శిగా కన్నబోయిన నిశాంత్ యాదవ్, ట్రెజరర్ గా సారంగపాణి, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రణధీర్ ఆర్ఎస్ఐ, కంది భరత్ జాయింట్ సెక్రటరీగా కరుణాకర్ తదితరులు ఎంపిక అయ్యారు. ఈ జిల్లా స్థాయి నూతన కార్యవర్గ ఎంపికకు అబ్జర్వర్ గా తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ట్రెజరర్ వెంకట్ నరసయ్య మరియు వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి బైరవైన కైలాష్ యాదవ్, వరంగల్ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిల్ పాల్గొన్నారు.

