epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్భాటంగా హామీలు.. అమలులో కొర్రీలు!

ఆర్భాటంగా హామీలు.. అమలులో కొర్రీలు!
మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం
రైతుల ‘అరిగోస’.. గన్ని బ్యాగులు లేక అన్నదాత ఆగమాగం
ఒక్కో సంచి రూ. 30 పెట్టి కొనుగోలు
మద్దతు ధర రూ. 2,400 ఉంటే.. రూ. 1,600కే తెగనమ్ముకుంటున్న రైతన్న
వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయకపోతే రాష్ట్రవ్యాప్త ధర్నాలు
మాజీమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ధ్వ‌జం
రాయపర్తిలో నేషనల్ హైవేపై ఎర్రబెల్లి బైఠాయింపు
కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

కాకతీయ, రాయపర్తి : “రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం” అని ఆర్భాటంగా హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. శనివారం రాయపర్తి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గన్ని బ్యాగులు లేవు.. లారీలు రావు!
ధర్నా సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెడుతున్న కొర్రీల వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. “హామీలు మాకొద్దు.. గన్ని బ్యాగులు కావాలి. లారీలు పంపి వెంటనే కొనుగోలు వేగవంతం చేయండి” అని నినదించారు. మక్కలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల రైతులు గత్యంతరం లేక బయట వ్యాపారులకు రూ. 1,600 నుంచి రూ. 1,800 మధ్య తక్కువ ధరకే అమ్ముకొని భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు లేకపోవడంతో రైతులు ఒక్కో సంచిని రూ. 30 వెచ్చించి సొంతంగా కొనుక్కుంటున్నారని తెలిపారు.

కలెక్టర్‌తో ఫోన్‌లో సంభాషణ..
ధర్నా స్థలం నుంచే ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్‌తో చరవాణిలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పేరుకుపోయాయని, అకాల వర్ష సూచనతో రైతులు ప్రాణసంకటంలో ఉన్నారని వివరించారు. తక్షణమే మక్కలు నిల్వ ఉంచేలా గోడౌన్లను ఏర్పాటు చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు వర్షం భయంతో రైతులు కుమిలిపోతున్నారని, రేవంత్ సర్కారు రైతుపై రాక్షసత్వం ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వానికి అల్టిమేటం
ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి వారం రోజుల్లోగా మక్కల కొనుగోళ్లను పూర్తి చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ నిరసనకారులతో చర్చలు జరిపి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మూనావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్, పూస మధు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.