ఘనంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
కాకతీయ, పెద్దవంగర: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలను శనివారం బిఆర్‌ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మంత్రి ఎర్రబెల్లి అభిమానులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో మండల కేంద్రం గులాబీమయంగా మారింది. బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో మండల నాయకులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదిగిరి రావు, సంజయ్, సుదీర్ బాబు, వెంకన్న, వేణు, శ్రీను, రాజేందర్, రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

