epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేటీఆర్ కొంద‌రివాడేనా..?

కేటీఆర్ కొంద‌రివాడేనా..?
బీఆర్ఎస్ పార్టీకి కొంత‌మంది జ‌ర్న‌లిస్టులే అవ‌స‌ర‌మా..?
వ‌రంగ‌ల్ ప్రెస్ అండ్‌ మీడియాలో వ‌ర్గీక‌ర‌ణ‌..!
పెద్ద, మ‌ధ్య‌, చిన్న పేప‌ర్లుగా తార‌తామ్యాల‌ సృష్టి
తాబేదార్లు చెప్పిన‌ట్లే న‌డుచుకుంటున్న పీఆర్వోలు, లీడ‌ర్లు
ప‌బ్లిక్ లీడ‌ర్ చిట్‌చాట్‌ను సైతం ప్రైవేటు ప్రొగ్రాంలా నిర్వ‌హ‌ణ‌
నిజాలు రాసేటోళ్ల క‌న్నా.. తాబేదార్లే ముఖ్య‌మా..?
స్ట్రీం ముసుగులో జోకొడుతున్న‌దెవ‌రు..?
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ర్య‌ట‌న‌పై కొంత‌మందికే స‌మాచారం
చిట్‌చాట్‌కు సైతం వారికే ఆహ్వానం..ఇలా అయితే ఎలా సారూ..?
అర్థం చేసుకోకుంటే ఆగ‌మ‌వ‌డం గ్యారంటీ అంటూ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో మీడియాపై పార్టీ నిర్వాహాకులు అనుస‌రించిన విధానంపై మీడియా అండ్ ప్రెస్ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది. బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ర్య‌ట‌న‌పై..చిట్‌చాట్ నిర్వ‌హ‌ణ‌పై కొంత‌మందికే స‌మాచారం ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్టీ జిల్లా నాయకత్వం అనుసరించిన‌ తీరుపై స్థానిక జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. కేవలం కొద్దిమందికే పార్టీ కార్యక్రమాలను పరిమితం చేస్తూ, నాయకులు అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు కేటీఆర్ కేవలం కొందరివాడేనా, లేక బీఆర్‌ఎస్ పార్టీకి కేవలం కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులు మాత్రమే అవసరమా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వర్గీకరణ పేరుతో తారతమ్యాలు
వరంగల్ ప్రెస్ అండ్ మీడియా రంగంలో కావాలనే కొందరు వ్యక్తులు వర్గీకరణకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద, మధ్య, చిన్న పేపర్లు అంటూ పత్రికల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ వివక్ష చూపుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల గొంతుకగా నిలిచి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నిజమైన జర్నలిస్టులను కావాలనే పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ తరహా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని, ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన పార్టీ నేతలు, ఇలా ఒక వర్గానికి వత్తాసు పలకడం దారుణమని మండిపడుతున్నారు.

తాబేదార్ల కనుసన్నల్లోనే పీఆర్వోలు, లీడర్లు
నాయకుల చుట్టూ చేరిన కొందరు తాబేదార్లు ఆడించినట్లే పీఆర్వోలు, పార్టీ లీడర్లు గుడ్డిగా నడుచుకుంటున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులుగా, బాధ్యత గల పబ్లిక్ లీడర్లుగా ఉండాల్సిన వారు నిర్వహించే చిట్‌చాట్‌లను సైతం కొద్దిమందికి మాత్రమే పరిమితం చేసి ఏదో ప్రైవేటు ప్రోగ్రాంలా నిర్వహిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి వాస్తవాలు రాసే నిజమైన జర్నలిస్టులను విస్మరించి, కేవలం త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నుకునే వాళ్ల‌కే లీడర్లు పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమ‌వుతోంది. ఇలాంటి సంస్కృతి వల్ల పార్టీకి మైలేజ్ రావకపోగా, క్షేత్రస్థాయిలో తీవ్రమైన నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

స్ట్రీమ్ ముసుగులో లబ్ధి పొందుతున్నదెవరు..?
… స్ట్రీమ్‌ ముసుగులో కొందరు జ‌ర్న‌లిస్టులు, వ్య‌క్తులు పార్టీ పెద్దలను త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ త‌మ ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. స్వార్థపరులను నెత్తికెత్తుకుని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. అందరినీ సమానంగా ఆదరించాల్సిన నాయకులు, ప్రెస్ అండ్ మీడియా బాధ్యులను ఇలా వర్గాలుగా విడదీసి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన సమాచారాన్ని కొద్దిమందికే పరిమితం చేయడం, చిట్‌చాట్‌ల పేరుతో గోప్యంగా వ్యవహరించడం లాంటి చర్యలు పార్టీ పరువును బజారుకీడ్చుతున్నాయని హిత‌వు ప‌లుకుతున్నారు. ఇప్పటికైనా పార్టీ నేతలు తమ పద్ధతులు మార్చుకోకపోతే, మీడియా వ్య‌తిరేకులుగా సంబంధిత లీడ‌ర్ల‌కు చెడ్డ‌పేరును సొంత చేసుకోక త‌ప్ప‌ద‌ని మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికి వాస్త‌వ ప‌రిస్థితిని అర్థం చేసుకోకుంటే పూర్తిగా ఆగమవడం గ్యారంటీ ఖాయ‌మంటూ మీడియా వర్గాల్లో తీవ్రమైన హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.