కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని ఆలేరు స్టేజ్ వద్ద గల శరత్ ఫెర్టిలైజర్స్ షాప్ ను మహబూబాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు ఎస్సై చిర్ర రమేష్ బాబు తో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం నరసింహులగూడెం గ్రామం లో కలుపు మందు తాగి చనిపోయిన సిద్నబోయిన నవీన్ భార్య ఫర్టిలైజర్ షాప్ పై కలెక్టర్ కి ఇచిన కంప్లైంట్ లో భాగంగా మండల వ్యవసాయ అధికారి భూక్యా మహేందర్ ఏ ఈ ఓ మణికంఠ పాల్గొని షాప్ లో ఉన్న స్టాక్ మరియు గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్ నందు అప్డేట్ చేయనందున పురుగు మందులు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగిందని అలాగే పూర్తి విచారణ జరిగిన అనంతరం ఉన్నత అధికారులకు రిపోర్ట్ రాసి పంపడం జరుగుతుందని తెలిపారు.

