ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నల్ల బ్యాడ్జీలతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీవో వినతి
కాకతీయ, ఇనుగుర్తి: విబిజి రామ్ జీ (ఎన్ఆర్ఈజీఎస్) సిబ్బంది కీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పార్థసారధికి మండలంలోని వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైనా ఉపాధి హామీ సిబ్బంది ని రెగ్యులర్ చేసి పే స్కేల్ కల్పించి ప్రతినెల ఒకటవ తారీఖున జీతాలు ఇవ్వాలని, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ కల్పించాలని, పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ దీప్లా, టి ఏ లు రంజిత్, అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ పాపారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు గుర్రం సత్యం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

