epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా

పెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసా
కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ
పిల్లలకు చెరో రూ.కోటి.. అమృతమ్మకు రూ.25 లక్షల సాయం
కేసీఆర్‌ రాకతో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి మాజీ సీఎం
బందోబస్తు వైఫల్యం.. 30 నిమిషాల పాటు కాన్వాయ్‌లోనే కేసీఆర్‌

కాకతీయ, నల్లబెల్లి : దివంగ‌త మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు పార్టీ తరఫున చెరో రూ.కోటి చొప్పున, వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. సుమారు 11 ఏళ్ల తర్వాత కేసీఆర్‌ నల్లబెల్లి గడ్డపైకి రావడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రహదారుల వెంట భారీగా జనం నిలవడంతో నల్లబెల్లిలో సందడి నెలకొంది. అయితే కేసీఆర్‌ కాన్వాయ్‌ వద్దకు ఒక్కసారిగా కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు 30 నిమిషాలపాటు కేసీఆర్‌ కాన్వాయ్‌లోనే ఉండాల్సి వచ్చింది. నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్‌ ముందుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్‌ వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచే చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున చెక్కులను అందించారు. అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో వారి భవిష్యత్‌ గురించి కూడా భరోసా కల్పించారు.

11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్‌ సుమారు 11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి రావడం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఆయన పర్యటనకు ముందుగానే నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రహదారుల వెంట కేసీఆర్‌ రాక కోసం ఎదురుచూశారు. కేసీఆర్‌ కాన్వాయ్‌ నల్లబెల్లికి చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో కేసీఆర్‌ కాన్వాయ్‌ నల్లబెల్లికి చేరుకుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్‌ వైపు కదిలారు. దీంతో కేసీఆర్‌ వాహనం చుట్టూ జనం గుమిగూడారు. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి కొంతసేపు అదుపులోకి రాలేదు. ఫలితంగా కేసీఆర్‌ సుమారు 30 నిమిషాల పాటు కాన్వాయ్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్‌ అధినేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావచ్చని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ.. అందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

కేసీఆర్‌ను చూసేందుకు వచ్చి..

ఉదయం నుంచే కేసీఆర్‌ కోసం వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఆయనను దగ్గరగా చూసేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్‌ చుట్టూ భారీగా జనం చేరడంతో పలువురికి ఆ అవకాశం లేకుండా పోయింది. కొందరు వినతిపత్రాలు అందించేందుకు ప్రయత్నించగా.. మరికొందరు కాన్వాయ్‌పై గులాబీ కండువాలు వేసేందుకు ప్రయత్నించారు. కాన్వాయ్‌ వద్దకు ఓ వాహనం అడ్డంగా రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. తోపులాటల మధ్య పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన కొంతమంది ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్‌ తిరుగు ప్రయాణంలోనూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కాన్వాయ్‌ వెంట కదిలారు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి మాజీ సీఎం కాన్వాయ్‌ ముందు నడుస్తూ ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌ భాస్కర్‌, ఆరూరి రమేష్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, సత్యవతి రాథోడ్‌, సంతోష్‌రావు, జీవన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, నాగూర్ల వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.