epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారంలో ఇసుక దోపిడి!

మేడారంలో ఇసుక దోపిడి!
జంపన్నవాగులో యథేచ్ఛగా తవ్వకాలు..
టిప్పర్లతో భారీగా రవాణా…..
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ తవ్వకాలు?
కన్నెత్తి చూడని అధికారులు..
ప్రజాప్రతినిధుల పాత్రపై అనుమానాలు…..

కాకతీయ ములుగు ప్రతినిధి: సమ్మక్క-సారలమ్మ వనదేవతల జాతరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం ఇప్పుడు ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతోంది. జాతర ముగిసిన అనంతరం జనసంచారం తగ్గడాన్ని ఆసరాగా చేసుకున్న ఇసుక అక్రమ రవాణాదారులు జంపన్నవాగును టార్గెట్‌గా చేసుకుని భారీగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి ఒడ్డుకు తరలించడం, అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..?

స్థానికుల ఆరోపణల ప్రకారం మేడారం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవసరాల పేరుతో జంపన్నవాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఎంత పరిమాణంలో ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు? అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టి, ఒడ్డున నిల్వ చేసి అనంతరం టిప్పర్ల ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు జంపన్నవాగు సహజ స్వరూపానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టపగలే టిప్పర్ల రాకపోకలు…..

జంపన్నవాగు నుంచి తవ్విన ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకటి రెండు టిప్పర్లు కాకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుకను తరలిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. రోజుల తరబడి తవ్వకాలు కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు.

గతంలో టిప్పర్ పట్టుబడినా..

మేడారం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో గత నెలలో నార్లాపూర్ వద్ద అధికారులు ఓ టిప్పర్‌ను గుర్తించి పట్టుకోవడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. మేడారం ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను అధికారులు పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ….?

జంపన్నవాగులో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి రాలేదా? లేక తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తవ్వకాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు దూరంగా ఉండటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నప్పటికీ చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు అంటున్నారు.

ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ఆరోపణలు….

ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు తెలియకుండా ఉండటం సాధ్యమేనా? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. మేడారం జాతరతో పాటు జంపన్నవాగుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతంలో ఇసుకను విచ్చలవిడిగా తవ్వడం వల్ల భవిష్యత్‌లో పర్యావరణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగు సహజ ప్రవాహానికి, భూగర్భ జలాలపై ప్రభావం పడకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? ఎంత మేరకు అనుమతించారు? ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తీసిన ఇసుక వాస్తవంగా ఎక్కడ వినియోగిస్తున్నారు? ఎన్ని టిప్పర్ల ద్వారా ఇసుక తరలించారు? ప్రభుత్వానికి ఎంత మేర ఆదాయం వచ్చింది? అనే అంశాలపై అధికారులు పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.