గిరిజన బంధు హామీ ఏమైంది?
గిరిజన హామీలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి
బీఆర్ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి
కాకతీయ, నల్లబెల్లి : గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన గిరిజన బంధు పథకం, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించింది, ఎన్ని పనులు చేపట్టిందో ప్రజలకు వెల్లడించాలని కోరారు. గిరిజన హామీలను వెంటనే అమలు చేసి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వాన్ని నిలదీస్తామని బానోత్ సారంగపాణి హెచ్చరించారు.

