ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ తనిఖీలు
విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాల్లో మద్యం బాటిళ్ల తనిఖీ
రెండు బృందాల దాడుల్లో 123 మద్యం బాటిళ్లు స్వాధీనం
కాకతీయ, హైదరాబాద్: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందాలు పహాడ్ షరీఫ్ వద్ద వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఏ, బీ బృందాల సీఐలు రమేష్, గణపతిరెడ్డి సిబ్బందితో కలిసి విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోవా, ఢిల్లీ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న 42 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరోవైపు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ సీ, డీ బృందాల సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు సిబ్బందితో కలిసి చేపట్టిన తనిఖీల్లో మరో 81 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. వీటిని కూడా శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐలు తెలిపారు.

