epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి
ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కాక‌తీయ‌, ఖ‌మ్మం : రాబోయే ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మాజీ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించి పార్టీ అభ్యర్థి విజయానికి బాటలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేట్‌ ఓటును స్వయంగా నమోదు చేసుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 28,500 గ్రాడ్యుయేట్‌ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి 100 ఓట్లకు ఒక సమన్వయకర్త చొప్పున 325 మందికి అదనంగా బాధ్యతలు అప్పగించామని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలో ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రుల వివరాలను సేకరించాలని సూచించారు.

నమోదు కేంద్రాలతో విస్తృత ప్రచారం

డివిజన్ల వారీగా టెంట్లు, గుడారాలు, పార్టీ కార్యాలయాల వద్ద నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను ఉధృతం చేస్తున్నామని అజయ్‌కుమార్‌ తెలిపారు. తాను వచ్చే నెల రోజుల్లో వారానికి కనీసం 2 రోజులు ఈ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటానన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

గత విజయాన్ని పునరావృతం చేయాలి

గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి అత్యధికంగా గ్రాడ్యుయేట్‌ ఓట్లు నమోదు చేయించి విజయంలో కీలక పాత్ర పోషించామని అజయ్‌కుమార్‌ గుర్తుచేశారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నాంది అని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్‌, పగడాల నాగరాజు, ఖమర్‌, మాజీ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, షేక్‌ మక్బుల్‌, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, జ్యోతి రెడ్డి, పల్లా రోజ్లీనా, కమల, బుడిగం శ్రీను, బుర్రి వెంకటేశ్వర్లు, బిక్కసాని ప్రశాంతిజస్వంత్‌, పసుమర్తి రామ్మోహన్‌, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, నాయకులు మెంతుల శ్రీశైలం, కొత్త వెంకటేశ్వరరావు పాషా, బత్తుల మురళి, వీరు నాయక్‌, పిన్ని కోటేశ్వరరావు, గుత్తా రవి, మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మెంటం రామారావు, ప్రదీప్‌, సర్పంచ్‌లు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు

రూ.205 కోట్లతో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు గృహజ్యోతి లబ్ధిదారులకు రూ.40.19 కోట్ల...

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం సిరిసిల్ల సభలో కేసీఆర్‌, కేటీఆర్‌పై దిగజారుడు...

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం!

మంత్రుల చుట్టూ.. ‘నాన్‌-లోకల్‌’ వలయం! లోకల్‌ క్యాడర్‌కు అంద‌నంత దూరంగా మినిస్ట‌ర్లు అన్‌ప్రియారిటీగా మారుతున్న...

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు క్రేన్లు, గజ ఈతగాళ్లు,...

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం

సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు పువ్వాడ...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.