epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే
285 గ్రామాల్లో సర్వే పూర్తి..
అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు
వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి చేయాలని లక్ష్యం
9,767 ఎకరాల భూమి ఆదా.. రూ.2,148.74 కోట్ల వ్యయం తగ్గింపు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

కాకతీయ, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర భూసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తిచేసి, భూ యజమానుల అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెలాఖరుకు తొలి దశను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో తొలి దశలో 2,720 గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేయగా, అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. డీజీపీఎస్‌, జీఐఎస్‌, క్యూజీఐఎస్‌ సాంకేతికతతో భూముల కొలతలను కచ్చితంగా నిర్వహించి, వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తామన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్‌ నంబర్‌ కేటాయించి, భూదార్‌ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. డిజిటల్‌ సర్వే సమాచారాన్ని భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు ప్రస్తుతం 2.29 కోట్లకు పెరిగాయని వివరించారు.

పైపుల కాలువలతో వేల ఎకరాల భూమి ఆదా

సీతారామ ఎత్తిపోతల పథకం పంపిణీ కాలువలను సాంకేతికంగా సాధ్యమైన ప్రాంతాల్లో పైపుల వ్యవస్థగా మార్చాలని మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుతం సుమారు 11,162 ఎకరాల భూమి అవసరం కాగా, పైపుల విధానంతో ఆ అవసరాన్ని 1,395 ఎకరాలకు తగ్గించవచ్చని అంచనా వేశారు. దీంతో 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల వరకు తగ్గింపు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 6,74,387 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

పాలేరులో త్వరలో భూదార్‌ పట్టాల పంపిణీ

తన పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో 665 ఎకరాలకు వంద శాతం రీసర్వే పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో అక్కడ భూదార్‌ పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. సర్వేకు ముందు పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలని, ఒకటి రెండు రోజుల ముందుగా గ్రామాల్లో చాటింపు వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం హద్దులను స్పష్టంగా గుర్తించిన తర్వాతే సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు! చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి :డా....

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల అధికారులతో...

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండ సమస్యలపై అధ్యయనం చేసి...

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు

15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు లామినేషన్‌ అవసరం లేకుండా...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సేవామూర్తి అణగారిన...

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి 13 కోట్ల ఓట‌ర్ల‌ పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన ఢిల్లీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.