అర్పణ పల్లిలో విషాదం
కాకతీయ కేసముద్రం : దసరా పండుగ రోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది కేసముద్రం మండలం అరపన పల్లి గ్రామానికి చెందిన తగురు సందీప్ ( డ్రైవర్) ఆయన భార్య వరంగల్ నుంచి రైలు మార్గంలో కేసముద్రం చేరుకొని కేసముద్రం నుండి అరపన పల్లి కి రోడ్డు మార్గమున స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్న భార్యాభర్తలు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు ఈ ప్రమాదంలో కేసముద్రం మండలం అరపన పల్లి గ్రామానికి చెందిన తగురు సందీప్ మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడి ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం సందీప్ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది

