గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌ను రద్దు చేయాలి
కాలం చెల్లిన కమిటీకి కొనసాగే అర్హత లేదు
రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరం
ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు పెట్టాలి
ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ కమిటీ ప్రకటించాలి
బైలా పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదు
దశలవారీగా ఆందోళనలు చేపడుతాం
సోమవారం వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్
ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి : టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్
కాకతీయ, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ ప్రస్తుత కమిటీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని టీయూడబ్ల్యూజే (హెచ్–143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ డిమాండ్ చేశారు. కమిటీ పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికలు జరిపే వరకు యూనియన్ తరఫున దశలవారీగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో లెనిన్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం వెంటనే అడ్వైజరీ కమిటీని ప్రకటించాలని, రెండు జిల్లాల యూనియన్ నేతల ద్వారా స్టీరింగ్ కమిటీ సభ్యులను నియమించాలని కోరారు. పాత బైలాను అనుసరించి ఎన్నికైన కమిటీ, ఇప్పుడు అదే బైలాను విస్మరించడం అనైతికమన్నారు. బైలా కమిటీ పేరుతో కాలయాపన చేయడం కుదరదని, ప్రస్తుత బైలా కమిటీని తమ యూనియన్ తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందులో ఉన్న యూనియన్ నేతలు వైదొలగుతారని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్‌లో వరంగల్, హనుమకొండ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని లెనిన్ చెప్పారు. గత ఎన్నికల్లో ప్రెస్‌క్లబ్ కమిటీలో సభ్యులుగా నియమితులైన యూనియన్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే ఉద్యమంలో సభ్యులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి : టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్

టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ కాలపరిమితి ముగిసినా ప్రెస్‌క్లబ్ ఎన్నికలకు వెళ్లకపోవడం అనైతికమని అన్నారు. కమిటీ పదవికాలం ఇప్పటికే ఏడాదిన్నర కాలం పూర్తయినా వివిధ కారణాలతో కొనసాగాలని చూడటం ఆక్షేపణీయమన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ క్లబ్ కమిటీలో ఉన్న టీయూడబ్ల్యూజే (హెచ్–143) యూనియన్ నేతలు ముందుగా కార్యవర్గం నుంచి వైదొలగుతూ..పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రజాస్వాయ్యయుత పద్ధతిలోనే నిరసన, పోరాటాలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ, డెస్క్ జర్నలిస్టుల కన్వీనర్ శంకేసి శంకర్రావు, రాష్ట్ర నేతలు చిలుముల సుధాకర్, కక్కెర్ల అనిల్‌కుమార్, పొగాకుల అశోక్, దొంతు నవీన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మస్కాపురి సుధాకర్, కార్యదర్శి హర్షం రాజ్‌కుమార్, హనుమకొండ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భూరం ప్రశాంత్, కార్యదర్శి తాళ్లపల్లి వేణుగోపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నవనీత్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు గోకారపు శ్యామ్‌కుమార్, బొడిగె శ్రీను, ఈసీ సభ్యులు కమటం వేణుగోపాల్, శ్రీకాంత్, తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడు అరెల్లి కిరణ్, కార్యదర్శి నాగరాజు, కెమెరామెన్ అధ్యక్షుడు చందు, బండి రవి, అమీర్, మునీర్, ఎస్.హరి, యుగేందర్, సంతోష్, విజయ్, ప్రభాకర్, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


