epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!
వైఎస్సార్‌ నగర్‌ వాసులకు అండగా ఉంటా
30 ఏళ్లుగా పేదలు అక్కడే నివాసం ఉంటున్నారు
కడియం శ్రీహరి తన నిబద్ధతను నిరూపించుకోవాలి
కాంగ్రెస్‌ నేతలే భూదోపిడీకి తెరలేపారు
రేపు గుడిసెవాసులతో కలిసి ఎంఆర్వో కార్యాలయానికి ర్యాలీ
మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌

కాకతీయ, హన్మకొండ : “నేను ఎప్పుడూ పేదల పక్షపాతినే.. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు అండగా నిలబడి వారి హక్కుల కోసం పోరాడతా.. ఒక్క గుడిసెవాసి కూడా భయపడాల్సిన అవసరం లేదు.. పేదల పొట్టకొట్టే ప్రయత్నాలను సహించేది లేదు” అని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల సమస్యపై ఆదివారం కాజీపేట చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, అందుకు బదులుగా వారిని ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. తనపై కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను పట్టించుకోనని, చిత్తశుద్ధి ఉంటే పేదలకు న్యాయం చేయాలని, వారి జీవనాధారాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. వైఎస్సార్‌ నగర్‌లో దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. ఇక్కడ కేవలం గుడిసెలు మాత్రమే లేవని, దేవాలయాలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రహదారులు, విద్యుత్‌ దీపాలు, తాగునీటి నల్లాలు, ఇతర మౌలిక వసతులు కూడా ఉన్నాయని వివరించారు. ప్రజలు ఇన్నేళ్లుగా నివసిస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ఇదే ప్రాంతంలో రైల్వేలో పదవీ విరమణ చేసిన అధికారుల కోసం కార్యాలయాన్ని కూడా నిర్మించామని గుర్తుచేశారు. ఇంతకాలంగా నివాసాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన సదుపాయాలు ఉన్న ప్రాంతంపై ఇప్పుడు వివాదం సృష్టించడం వెనుక ఉద్దేశాలేమిటో తేలాల్సి ఉందన్నారు.

అర్బన్‌ సీలింగ్‌ భూమిలో బస్టాండ్‌ ప్రతిపాదన

సుమారు 30 ఏళ్ల క్రితమే స్వర్గీయ ప్రణయ్‌ భాస్కర్‌, విజయరామారావు, కడియం శ్రీహరి కలిసి ఈ అర్బన్‌ సీలింగ్‌ భూమిలో బస్టాండ్‌ నిర్మించాలని ప్రతిపాదనలు పంపారని వినయ్‌ భాస్కర్‌ వెల్లడించారు. అప్పట్లో ప్రజా అవసరాల కోసం ఈ భూమిని వినియోగించాలనే ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. అలాంటి భూమి విషయంలో ఇప్పుడు పేదల నివాసాలకు ముప్పు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. భూమి వ్యవహారంలో వాస్తవాలు బయటకు తీసుకురావాలని, పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కడియం శ్రీహరి కమిట్‌మెంట్‌ ఏమైంది?

2014 ఎన్నికల సమయంలో తాను, అప్పటి ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని వినయ్‌ భాస్కర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారని, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. “కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన కడియం శ్రీహరి గారూ.. వైఎస్సార్‌ నగర్‌ పేదల సమస్య మీకు పట్టదా? నాడు అండగా ఉంటానని చెప్పిన మీ కమిట్‌మెంట్‌ ఎక్కడికి పోయింది?” అని ప్రశ్నించారు. పార్టీలు మారడం, రాజకీయ విమర్శలు చేయడం కంటే పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

నాయిని మొసలి కన్నీరు కారుస్తున్నారు

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల పట్ల ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులే వైఎస్సార్‌ పేరుతో కాజీపేటలో గుడిసెలు ఏర్పాటు చేయించారని, ఇప్పుడు అదే పేదల నివాసాల విషయంలో మాట మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు ముఠాగా ఏర్పడి భూదోపిడీకి తెరలేపారని విమర్శించారు. “లిల్లీపుట్‌ నాయకుడు ఒకరు, తోట రాముడు కలిసి నాపై చిల్లర విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే ప్రజల తరఫున పోరాటానికి రండి” అని సవాల్‌ విసిరారు. కాజీపేట చౌరస్తాలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ అనుమతుల వ్యవహారంపై సమగ్ర వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదు

తనకు తోడుగా ఉన్న నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. వినయ్‌ భాస్కర్‌కు తోడుగా ఉంటే కేసులు, ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నట్లు తమ నాయకులు చెబుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి పోరాడామని, అలాంటి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తాము బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఎవరి అండ చూసుకొని అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో తమకు తెలుసని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు.

రేపు ఎంఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు మద్దతుగా సోమవారం కాలనీ నుంచి కాజీపేట ఎంఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వినయ్‌ భాస్కర్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమతో కలిసి వచ్చే ప్రజాసంఘాలను కలుపుకొని పేదల తరఫున పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గుడిసెవాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి హక్కుల కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పేదల నివాసాలను కాపాడటమే తమ లక్ష్యమని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పేదల స్థలం జోలికొస్తే ఉసురు తాకుతుంది : మర్రి యాదవరెడ్డి

కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ.. నాయిని రాజేందర్‌రెడ్డి మూడేళ్లలో బాగానే సంపాదించుకున్నారని విమర్శించారు. పేదల స్థలం జోలికి వస్తే వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. వైఎస్సార్‌ నగర్‌ ప్రజలు నిరుపేదలని, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నాయినిపై ఉందన్నారు. ప్రజాప్రతినిధిననే విషయాన్ని మరిచి అహంకారపూరితంగా మాట్లాడటం సరికాదని, తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. కాజీపేట చౌరస్తాలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పెద్దలకు అండగా ఉండటం కాదని, పేదలకు స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. “దోచుకున్నది, దాచుకున్నది చాలు రాజేందర్‌రెడ్డి.. పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దు” అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యులు నార్లగిరి రమేష్‌, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, సోదా కిరణ్‌, తండమల్ల వేణు, డివిజన్‌ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్‌, రంజిత్‌, ఆర్టీఏ మాజీ సభ్యుడు కాటాపూర్‌ రాజు, సీనియర్‌ నాయకులు సుంచు కృష్ణ, మర్యాల కృష్ణ, నయీంజుబేర్‌, అఫ్జల్‌, యాదగిరి, రఘు, ప్రభాకర్‌, ఎస్కే మహమూద్‌, రాబర్ట్‌, బాచి, బరిగెల వినయ్‌, శ్రీను, లీగల్‌ సెల్‌ బాధ్యులు నాయిని రవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి కాలం చెల్లిన క‌మిటీకి కొన‌సాగే...

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు..

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు.. కాకతీయ,...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన కాకతీయ,శంకరపట్నం:మోడల్...

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు! * కబడ్డీ, వాలీబాల్‌తో పాటు...

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.