epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!
కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం
బీఆర్ఎస్ నేత‌ల‌పై వీడియోల్లో త‌ప్పుడు ప్ర‌చారం 
చిన్నా పెద్ద తేడా తెలియ‌కుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
ఈ వీడియోల వెనుక ఎమ్మెల్యే అల్లుడి కుట్ర ఉంది
మూడేళ్లుగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు
బాంబుల బెదిరింపులు, వీడియోల రాజకీయాలకు స్వస్తి పలకాలి
అభివృద్ధి పనులపై ఆధారాలతో చర్చకు సిద్ధం
పార్టీ కార్యాలయ ఘటన వీడియోలు నా దగ్గర ఉన్నాయి
మరోసారి వీడియోలు విడుదలైతే మూడు రోజుల్లో సమాధానం
బీఆర్ ఎస్ నేత దాస్యం విజయ్‌ భాస్కర్‌ హెచ్చరిక
కాకతీయ, హన్మకొండ : కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని, వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ నాయకుడు దాస్యం విజయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా పోలీసుల ద్వారా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాంబుల బెదిరింపులు, రికార్డెడ్‌ వీడియోలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డిని హెచ్చరించారు. మంగ‌ళ‌వారం హ‌న్మ‌కొండ వ‌డ్డెప‌ల్లిలోని వారి స్వ‌గృహంలో దాస్యం విజ‌య్‌భాస్క‌ర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై, పార్టీ నేత‌ల‌పై, దాస్యం కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆరోప‌ణ‌ల‌తో కూడిన వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నార‌ని అన్నారు. ఈ వీడియోల వెనుక వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అల్లుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి కుట్ర ఉంద‌ని ఆరోపించారు. 1989 నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, తన అన్న స్వర్గీయ దాస్యం ప్రణయ్‌ భాస్కర్‌ వెంట పదో తరగతి నుంచే పోస్టర్లు అతికిస్తూ, జెండాలు మోస్తూ పనిచేశానని విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. ప్రణయ్‌ భాస్కర్‌ టీడీపీలో ఉన్నప్పటి నుంచి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నప్పటి వరకు తాను ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చట్టానికి లోబడే నిరసనలు తెలిపానని, తనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదని పేర్కొన్నారు. పోలీసు రికార్డులను ఎవరైనా పరిశీలించుకోవచ్చన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను బాంబులతో బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడికి రమ్మన్నా కార్యకర్తలతో కలిసి వచ్చేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. యువకులను గదుల్లోకి తీసుకెళ్లి రికార్డెడ్‌ సందేశాలు చెప్పించి వీడియోలు విడుదల చేయిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ధైర్యముంటే ప్రజల్లోకి వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో బీర్‌ బాటిళ్లు విసిరిన ఘటనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మరోసారి ఇలాంటి వీడియోలు విడుదలైతే మూడు రోజుల్లో సమాధానం చెబుతానని హెచ్చరించారు.
అభివృద్ధిపై ఆధారాలతో చర్చకు సిద్ధం
తాము అధికారంలో ఉన్న 15 నెలల కాలంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి, మంజూరు చేయించామని విజయ్‌ భాస్కర్‌ తెలిపారు. తాము మంజూరు చేసిన పనులకే ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆ పనులకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుత పాలకులు రెండేళ్ల పది నెలల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను వివాదాలకు దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా పనిచేసుకునే వ్యక్తినని, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తుండటంతోనే మాట్లాడాల్సి వస్తోందన్నారు. నాయిని రాజేందర్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందని, ఆయన కూడా బెదిరింపులు, వీడియోల రాజకీయాలను ప్రోత్సహించరని భావిస్తున్నానన్నారు. ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. తన చర్యలన్నీ చట్టానికి లోబడే ఉంటాయని విజయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి!

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి! జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల కాకతీయ, గీసుగొండ...

పట్టా భూమి కబ్జాకు యత్నం

పట్టా భూమి కబ్జాకు యత్నం 2006 లో కొనుగోలు చేసి పట్టా చేపించుకున్న  అధికారులు...

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి న్యాయవాదులు, అధ్యాపకులు, యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాలి సర్వోత్తమ్‌రెడ్డిని...

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి! నవంబర్‌ 6తో ఓటరు నమోదు గడువు...

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన...

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే! దేవాదుల పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదు? ప్రభుత్వంపై మాజీ...

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌!

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి,...

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.