epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గడువు ముగిసినా గద్దె దిగరా!

గడువు ముగిసినా గద్దె దిగరా!
ప్రజాస్వామ్యానికి పాతరేసిన గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్ క‌మిటీ
రెండేళ్ల పదవీకాలంతో ఎన్నికై.. నాలుగేళ్లుగా కొనసాగింపు
2024 డిసెంబరులోనే ముగిసిన పాలకవర్గం గడువు
ఎన్నికలు నిర్వహించకుండా కుయుక్తుల‌తో కాలయాపన
ఇప్పుడు బైలా సవరణ పేరుతో మరో కొత్త నాటకం
అర్హత ముగిసిన కమిటీకి బైలా రూపకల్పన అధికారం ఎక్కడిది?

కాకతీయ, హనుమకొండ : జర్నలిస్టుల ఐక్యతకు, హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలవాల్సిన గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌.. ఇప్పుడు అక్క‌డే ప్రజాస్వామ్యానికి పాతర‌ప‌డుతోంది. సభ్యులు రెండేళ్ల కాలపరిమితికి ఎన్నుకున్న పాలకవర్గం గడువు ముగిసి మ‌రో రెండేళ్లు కావ‌స్తోంది. 2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో రెండేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన కమిటీ గడువు 2024 డిసెంబరుతోనే ముగిసింది. నిబంధనల ప్రకారం అప్పుడే కొత్త ఎన్నికలు నిర్వహించి, సభ్యుల తీర్పు మేరకు కొత్త కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ గడువు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకుండా పాత కమిటీనే కొనసాగుతూ వ‌స్తోంది. సభ్యులు ఎన్నుకున్నది రెండేళ్లకే అయినప్పుడు, మరో రెండేళ్లుగా పదవుల్లో కొనసాగడానికి ఈ కమిటీకి ఎవరు అధికారం ఇచ్చారన్న ప్రశ్నలు స‌భ్యుల నుంచి వినిపిస్తున్ఆన‌యి. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా బాధ్యతలు వదలకుండా అనైతికంగా క‌మిటీ కొన‌సాగుతోంది. ప్రెస్‌క్లబ్‌ అనేది కొందరి వ్యక్తిగత సంస్థ కాదని, సభ్యులందరి భాగస్వామ్యంతో నడవాల్సిన వేదిక అని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం ఈ ప్రాథమిక బాధ్యతను విస్మరించి పదవుల్లో కొనసాగుతుండటం క్లబ్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వినతులు.. విమర్శలు.. అయినా చలనం లేదు!

పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై జర్నలిస్టులు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని వరంగల్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. కాలపరిమితి ముగిసిన కమిటీని కొనసాగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రెస్‌క్లబ్‌ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తీరును కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సామాజిక మాధ్యమాలు, వివిధ మీడియా వేదికల ద్వారా కూడా ప్రస్తుత కమిటీ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించకపోవడం, సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, అధికారాన్ని వదులుకోకుండా కొనసాగడం వంటి అంశాలపై మీడియాలోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. ఇంత జరుగుతున్నా పాలకవర్గంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కనీసం ఎన్నికల తేదీని ప్రకటించడం, సభ్యులతో సమావేశం నిర్వహించడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక చర్యలు చేపట్టడం కూడా జరగడం లేదని విమర్శిస్తున్నారు. కలెక్టర్లకు వినతులు సమర్పించినా, వివిధ వేదికలపై నిరసన తెలిపినా ఫలితం లేకపోవడంతో సభ్యుల్లో అసహనం పెరుగుతోంది. విమర్శలకు సమాధానం చెప్పకుండా, ఎన్నికలపై స్పష్టత ఇవ్వకుండా మౌనంగా కొనసాగడం ద్వారా ప్రస్తుత కమిటీ తన వైఖరిని మరింత వివాదాస్పదం చేసుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తాల్సిన వేదికలోనే సభ్యులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బైలా సవరణ పేరుతో కొత్త నాట‌కం..!

ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలు నిర్వహించ‌కుండా.. బైలా సవరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయని సభ్యులు భావిస్తున్న సమయంలో కొత్త బైలా రూపకల్పన, సవరణలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంటూ మరో కార్యాచరణను ముందుకు తీసుకొచ్చింది. వాస్తవానికి పదవీకాలం ముగిసిన పాలకవర్గం ముందుగా ఎన్నికల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైతే కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులందరి భాగస్వామ్యంతో బైలా మార్పులపై చర్చించవచ్చు. కానీ ఎన్నికలే నిర్వహించకుండా, అదే కాలపరిమితి ముగిసిన కమిటీ ఆధ్వర్యంలో బైలా సవరణ ప్రక్రియ చేపట్టడం వెనుక ఉద్దేశమేమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్త బైలాకు చట్టబద్ధత కల్పించే పేరుతో ప్రస్తుత కమిటీ కొనసాగింపునకు మార్గం సుగమం చేసుకుంటోందని సభ్యులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. బైలా సవరణ అనేది క్లబ్‌ భవిష్యత్తు, సభ్యుల హక్కులు, ఎన్నికల విధానం, ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం. అలాంటి ప్రక్రియలో ప్రతి సభ్యుడికి సమాచారం అందించి, అభిప్రాయాలు సేకరించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగానీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి బైలా పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదని సభ్యులు స్పష్టం చేస్తున్నారు.

సభ్యుల హక్కులపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిది?

బైలా సవరణల విషయంలో సభ్యుల భాగస్వామ్యం, పారదర్శకత అత్యంత కీలకం. ప్రెస్‌క్లబ్‌లో సభ్యత్వం ఉన్నవారి హక్కులు, ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, వివిధ మీడియా విభాగాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై మార్పులు చేయాలంటే అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో ప్రస్తావనకు వచ్చిన బైలా కమిటీ ఏర్పాటు, అందులో సభ్యత్వం లేదా ఓటు హక్కు లేని వ్యక్తులకు చోటు కల్పించారన్న అభ్యంతరాలు కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. సభ్యుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిబంధనల రూపకల్పనలో ఎవరు భాగస్వాములవుతున్నారు, వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, కమిటీకి ఏ మేరకు అధికారాలు ఉన్నాయి అనే వివరాలను బహిర్గతం చేయాలని జర్నలిస్టులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రెస్‌క్లబ్‌లోని వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టుల ప్రాతినిధ్యం, ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను పరిమితం చేసేలా ఎలాంటి నిబంధనలు రూపొందించకూడదని స్పష్టం చేస్తున్నారు. బైలా ముసాయిదాను సభ్యులందరికీ అందుబాటులో ఉంచి, అభ్యంతరాలు స్వీకరించి, చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలపరిమితి ముగిసిన కమిటీ తన కొనసాగింపునకు అనుకూలంగా నిబంధనలు రూపొందించుకుంటే అది మరింత వివాదానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రెస్‌క్లబ్‌ వేదికపై ఒక వర్గం ఆధిపత్యం కాకుండా అన్ని విభాగాల జర్నలిస్టులకు సమాన గౌరవం, ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత పాలకవర్గం తన పదవీకాలం ముగిసిన విషయాన్ని గుర్తించి ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన తేదీ ప్రకటించాలి. బైలా సవరణ పేరుతో చేపట్టిన ప్రక్రియను సభ్యుల ముందుంచి, వారి సమ్మతి, అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే ప్రెస్‌క్లబ్‌లో నెలకొన్న వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉందని జర్నలిస్టు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.