epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి

విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలి
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సత్య శారద

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని వెల్ఫేర్ హాస్టల్స్‌, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంప్లైంట్ బాక్స్‌లకు అందిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో సంబంధిత శాఖాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, హాస్టల్ నిర్వహణలో లోపాలుంటే తక్షణమే సరిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుండి పలు సమస్యలపై ఫిర్యాదుల పెట్టె ద్వారా  అందిన  ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత విభాగాల అధికారులకు కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలన్నారు. గీజర్స్, బ్లాంకెట్స్ లభ్యతపై ప్రత్యేక సమీక్ష చేసి  హాస్టల్స్‌లో చలికాలం వేడి నీటి సౌకర్యం (గీజర్స్) లభ్యతపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అవసరమున్న హాస్టల్స్‌ వివరాలతో కూడిన నివేదికలను తక్షణమే సమర్పించాలని సంక్షేమ విభాగ అధికారులను ఆదేశించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్‌ వారీగా హాట్ వాటర్ గీజర్స్, ఉలెన్ బ్లాంకెట్స్ వంటి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల వసతి, భోజనం, శుభ్రత, భద్రత, రోజువారీ ఆహార సరఫరా, డీలర్ల ద్వారా బియ్యం–పప్పులు వచ్చే విధానం, ఆహార నాణ్యతపై కలెక్టర్ సమగ్రంగా ఆదేశాలు జారీ చేశారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మోడల్ స్కూల్స్‌, కేజీవీబీ హాస్టల్స్‌ సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్, , జి సి డి ఓ ఫ్లోరెన్స్, ఆర్ సి ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.