epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది

కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది
మొదటి విడతలో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌య‌మే నిద‌ర్శ‌నం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ, గీసుగొండ : పంచాయతీ ఎన్నికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ హవేలీ,శాయంపేట హవేలీ,బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వ అవస్థలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. మొదటి విడతలో వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి గెలుపు ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించి, మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్గానికీ సంక్షేమం చేకూరిందని, గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ నిలిచిపోయిందని,గొర్రెల పంపిణీ పూర్తిగా ఆగి పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఓటు వేస్తేనే పథకాలు వర్తిస్తాయని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, పింఛన్ల విషయంలో ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.ఓటమి భయంతోనే అధికార పార్టీ ఈ రకమైన బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నా బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఓటు అడిగి వస్తే, ఇచ్చిన హామీల ఏమయ్యాయో నిలదీయాలని పిలుపు నిచ్చారు.సమావేశాల్లో మండల, గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.

సొంత గూటికి చేరిన నాయకులు

మండలంలోని ఊకల్ గ్రామంలో గతంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ బేతినేని వీరారావు,సీనియర్ నాయకుడు మండల సదానందం ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వీరిద్దరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.