epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!
కేయూసీ ప‌రిధిలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తి అరెస్టు
సినిమాకు వెళ్లిన దంపతుల ఇంట్లో దొంగతనం
ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం
టెక్నాలజీతో నిందితుడి పట్టివేత..

కాకతీయ, వరంగల్ బ్యూరో : తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సబ్బాని రంజిత్ (24) ప్రస్తుతం హనుమకొండ పరిధిలో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంపాదనను మద్యం, జల్సాలకు ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఇతనిపై గతంలో 2020లో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు నమోదై జైలుకు వెళ్లి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబంతో కలిసి గత మూడేళ్లుగా కెయూసి పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసిస్తున్న ఓ దంపతులు ఇంటికి తాళం వేసి సినిమా వెళ్లినట్లు గమనించిన నిందితుడు, ఎవరికి అనుమానం రాకుండా తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న నాలుగు బంగారు గాజులు (40 గ్రాములు), రూ.40 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేసి పరారయ్యాడు. బాధితులు 250 గ్రాముల బంగారం చోరీ అయిందని ఫిర్యాదు చేయడంతో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి కదలికలపై నిఘా పెట్టి, శనివారం ఉదయం కెయూసి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో చోరీ చేసిన బంగారు గాజులు లభ్యమయ్యాయి.

40 గ్రాముల బంగారం స్వాధీనం..!

విచారణలో తాను కేవలం 40 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్ మాత్రమే చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించగా, బాధితుల ఇంటిని మళ్లీ తనిఖీ చేయగా మిగిలిన బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ, చోరీకి గురైన సొమ్మును అధికంగా చూపుతూ తప్పుడు ఫిర్యాదులు ఇస్తే సంబంధిత బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడి అరెస్టులో ప్రతిభ చూపిన సీసీఎస్, కెయూసి ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రవికుమార్, ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్‌స్పెక్టర్ దేవేందర్, కెయూసి ఎస్‌ఐలు శ్రీకాంత్, కిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మధుకర్, చంద్రశేఖర్, వంశీ, విశ్వేశ్వర్, ఐటీ కోర్ కానిస్టేబుళ్లు నాగేష్, ప్రవీణ్‌లను డీసీపీ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.