epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం

సమాజ సేవలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం
కరీంనగర్ విద్యావేత్తల సమావేశంలో కార్యవాహ కాచం రమేష్

కాకతీయ, కరీంనగర్ : వందేళ్లుగా సమాజం, మాతృభూమి సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అని, సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే సంఘ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు.
ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన విద్యావేత్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘ స్థాపన నాటి నుంచి హిందూ సమాజానికి అవసరమైన ప్రతి రంగంలో ఆర్ఎస్ఎస్ నిరంతర సేవలు అందిస్తూ వస్తోందన్నారు.
శతాబ్ది సందర్భంగా సమాజ పరివర్తన ద్వారా దేశ పరమవైభవం సాధ్యమని లక్ష్యంగా ‘పంచ పరివర్తన్’ పిలుపును ఆర్ఎస్ఎస్ ఇచ్చిందన్నారు. కుటుంబ ప్రబోధన్, స్వదేశీ భావన, సామాజిక పరివర్తన, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను స్వయంసేవకులు విస్తృతంగా చేపడుతున్నారని తెలిపారు. 1925లో విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ రావు బలి రామ్ పంత్ హెడ్డగేవార్ ప్రారంభించిన ఆర్ఎస్ఎస్, వందేళ్లుగా స్వచ్ఛందంగా సమాజ సేవ చేస్తోందన్నారు. హిందుత్వాన్ని మత లేదా రాజకీయ కోణంలో మాత్రమే చూడటం ద్వారా ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని, సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే కొంతకాలం కార్యకలాపాల్లో భాగస్వాములవ్వాలని సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, కరీంనగర్ జిల్లా సంఘచాలక్ సీఏ నిరంజనాచారి, జిల్లా సహ సంఘచాలక్ ఎలగందుల సత్యనారాయణతో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.