epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు
15 మంది అరెస్టు… మరో 9 మంది పరారీ
రూ.63.19 లక్షల నగదు, కోట్ల ఆస్తులు స్వాధీనం
జనగామ–యాదాద్రిలో భారీగా రిజిస్ట్రేషన్ల‌ మోసం
నకిలీ చలాన్లతో 1,080 రిజిస్ట్రేషన్లు
రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
22 కేసులు నమోదు… వివ‌రాలు వెల్ల‌డించిన క‌మిష‌న‌ర్ స‌న్‌ప్రీత్‌సింగ్‌

కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన కుంభకోణాన్ని జనగామ పోలీసులు బట్టబయలు చేశారు. జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని కాజేసిన ముఠాకు చెందిన 15 మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ముఠా సభ్యుల వద్ద నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న రూ.1 లక్ష, సుమారు రూ.1 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పసునూరి బసవ రాజు (32), జెల్లా పాండు (46), మహేశ్వరం గణేష్ కుమార్ (39), ఈగజులపాటి శ్రీనాథ్ (35), యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్ (35), కొలిపాక సతీష్ కుమార్ (36), తడూరి రంజిత్ కుమార్ (39), దుంపల కిషన్ రెడ్డి (29), దశరథ్ మేఘావత్ (28), నారా భాను ప్రసాద్ (30), గొపగాను శ్రీనాథ్ (32), శివ కుమార్ (33), ఒగ్గు కర్నాకర్ (42), అలేటి నాగరాజు (32) ఉన్నారు. వీరంతా జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇలా సాగిన మోసాల బాట…

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లోని క‌మిష‌న‌రేట్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు, జెల్లా పాండు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహించేవారు. గణేష్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డబ్బును మీసేవ, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా వసూలు చేసేవాడు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని కమిషన్లుగా మద్యవర్తులకు ఇచ్చి, మిగిలిన డబ్బును ప్రధాన నిందితులకు పంపేవాడు. బసవ రాజు ధరణి, భూభారతి వెబ్‌సైట్‌లోని “ఇన్‌స్పెక్ట్ – ఎడిట్ అప్లికేషన్”ను దుర్వినియోగం చేసి, చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని తగ్గించేవాడు. ఆ తర్వాత మొబైల్ యాప్‌ల సహాయంతో నకిలీ చలాన్లు తయారు చేసి రైతులకు పంపించేవారు. చెల్లించాల్సిన రుసుముకన్నా తక్కువగా మార్పు చేసిన చలాన్లను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకునేవారు.

1,080 రిజిస్ట్రేషన్లలో మోసం

ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 1,080 రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి మోసాలు జరిగినట్లు తేలింది. ఈ కుంభకోణంపై మొత్తం 22 కేసులు నమోదు కాగా, వాటిలో జనగామ జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 15 కేసులు ఉన్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా మీ సేవ, ఆన్‌లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్దకు రావాల్సిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వద్దకే తీసుకుని నమోదు చేసేదని పోలీసులు తెలిపారు. ప్రతి రిజిస్ట్రేషన్‌లో 10 నుంచి 30 శాతం వరకు కమిషన్లుగా పంచుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ భారీ స్కామ్‌ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్‌ఐలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.