epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట
మూడు మేయ‌ర్ ప‌ద‌వులు, 38 ఛైర్‌పర్సన్ పదవులు బీసీలకు రిజర్వ్
జీహెచ్ ఎంసీలో 122 సీట్లు కేటాయింపు
మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ గణనీయమైన ప్రాధాన్యం
ఎస్టీ, ఎస్సీల‌క‌న్నా రెట్టింపుగా రిజ‌ర్వుడు
ప‌ట్ట‌ణాల్లో రెండు సామాజిక వ‌ర్గాల జ‌నాభా త‌క్కువే
త‌క్కువ సీట్ల కేటాయింపున‌కు అదే ప్ర‌ధాన కార‌ణం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు సంకేతాలు వెలువ‌డుతున్న నేప‌త్యంలో రిజర్వేషన్ల కేటాయింపులు ప్ర‌క్రియ పూర్త‌యింది. బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పట్టణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 300 వార్డుల్లో 122 సీట్లను బీసీలకు కేటాయించారు. వీటిలో 61 సీట్లు బీసీ మహిళలకు రిజర్వ్ చేయడం గమనార్హం. జీహెచ్ ఎంసీలో బీసీలకు ఇంత భారీ సంఖ్యలో సీట్లు కేటాయించడం చారిత్రాత్మ‌క నిర్ణ‌యంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

మిగ‌తా తొమ్మ‌ది కార్పోరేష‌న్ల‌లోనూ..
రాష్ట్రంలోని మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీసీలకు గణనీయమైన ప్రాధాన్యం లభించింది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి ప్రధాన పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన బీసీ కోటాను ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 26, కరీంనగర్‌లో 25, నిజామాబాద్‌లో 24 బీసీ సీట్లు కేటాయించారు. ఖమ్మం, వరంగల్, మంచిర్యాల కార్పొరేషన్లలో బీసీలకు 20 సీట్లు చొప్పున దక్కాయి. నల్గొండ, రామగుండం కార్పొరేషన్లలో 16 సీట్లు లభించగా, కొత్తగూడెంలో మాత్రం బీసీలకు కేవలం 7 సీట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రిజర్వేషన్ కేటాయింపులు కేవలం వార్డులకే పరిమితం కాలేదు. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 మేయర్ పదవులను బీసీలకు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 మున్సిపాలిటీల్లో 38 ఛైర్‌పర్సన్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో పట్టణ పాలనలో బీసీల రాజకీయ ప్రాధాన్యం మరింత పెరగనుంది.

ఎస్సీ, ఎస్టీల‌కు త‌క్కువ వెనుక కార‌ణం ఇదే..!
జీహెచ్ ఎంసీలో ఎస్పీల‌కు23, ఎస్టీల‌కు కేవలం 5 సీట్లే దక్కాయి. పూర్తిగా 2011 జ‌నాభా లెక్క‌ల ఆధారంగానే ఈ రిజ‌ర్వేష‌న్లు జ‌రిగిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో బీసీల ఆధిప‌త్యాన్ని ఈలెక్క‌లు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2011 జనగణన ఆధారంగా ఎస్టీ, ఎస్సీల‌కు రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో వారి జనాభా తక్కువగా ఉండటంతో ఆ వాటాను సర్దుబాటు చేస్తూ ఈ దఫా బీసీ రిజర్వేషన్లను పెంచినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీలకు 296 సీట్లు, ఎస్సీల‌కు 117, ఎస్టీలకు 27 సీట్లు కేటాయించారు. ఈ గణాంకాలే ఎస్టీ, ఎస్సీల‌తో పోలిస్తే బీసీలకే స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు చూపిస్తున్నాయి.

ఫిబ్ర‌వ‌రిలోనే మొద‌టివారంలోనే నోటిఫికేష‌న్‌

ఫిబ్రవరి 2026లో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. ఈ పరిణామాలతో బీసీ ఓటు బ్యాంక్ కేంద్రంగా రాజకీయ సమీకరణలు మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలకు ఇది పెద్ద సవాలుగా మారనుండగా, ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయన్న అంచనాలు బలపడుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.