epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భారీ వ‌ర్షాల నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ములుగు జిల్లా ఏస్పీ శ‌భరీష్‌

కాక‌తీయ‌, ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌క‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక జారీ చేసిన నేపథ్యంలో ములుగు జిల్లాలోని లోత‌ట్టు ప్రాంతాల‌, గోదావ‌రి, జంప‌న్న వాగు పరివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ములుగు జిల్లా ఏస్పీ శ‌భ‌రీష్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌జ‌లు వ‌ర‌ద నీటి ప్ర‌వాహంలో ఉన్న వంతెన‌లు, క‌ల్వ‌ర్టులు, ర‌హ‌దారుల పై నుంచి దాట‌రాద‌ని, శిధిలావ‌స్థ‌లో ఉన్న ఇండ్ల‌లో నివాసం ఉండ‌కూడ‌ద‌ని, త‌డిగా ఉన్న విద్యుత్ క‌రెంట్ పోల్స్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్లను తాక‌రాద‌ని, గ్రామాల్లో చేప‌ల వేట‌కు ఎవరూ వెళ్ల‌కూడద‌ని జిల్లా ఏస్పీ తెలిపారు.

అత్య‌వ‌స‌రం అయితే తప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, వ‌ర‌ద ప్ర‌వ‌హాల వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ సిబ్బంది సూచ‌న‌లు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌ద్యంలో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం జ‌రిగింద‌ని, విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కోనేందుకు పోలిస్ శాఖ సిద్దంగా ఉంద‌ని, అలాగే ముంపు ప్రాంతాల్లో త‌క్ష‌ణ స‌హ‌చ చ‌ర్య‌ల కోసం జిల్లా విప‌త్తు ప్ర‌తి స్పంద‌న దళాలు (డీడీఆర్ఏఫ్‌)(ఏస్‌డీఆర్ఏఫ్‌) ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని ఏస్పీ తెలిపారు.

ఎటువంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు తలెత్తిన ప్ర‌జ‌లు పోలీస్ స‌హయం కోసం డ‌య‌ల్ 100 వినియోగించుకోవాల‌న్నారు. ములుగు మీదుగా ఏటూరునాగారం, వెంకటాపురం, వాజీడు, మంగపేట మండలాలు వెళ్లే ప్రయాణికులు, బోగోత జలపాతం విక్షించే పర్యాటకులు వర్షాలు తగ్గే వరకు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల‌ని జిల్లా ఏస్పీ తెలిపారు. ఇప్ప‌టికే భారీ వ‌ర్షం వ‌ల‌న ముంపు ప్రాంతంలో ఉన్న‌టువంటి ప్రాజెక్ట్ నగర్ లోని 10 కుటుంబాలను పునరావాస కేంద్రంకి తరలించడం జరిగింద‌ని, అలాగే వ‌ర‌ద ప్ర‌వ‌హాల వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బందిని ఏప్ప‌టికప్పుడు అప్ర‌మ‌త్తం చేయ‌డం జ‌రుగుతుందని అయ‌న తెలిపారు.

ప్ర‌యాణికులు ఇలా వెళ్లండి.. పోలిస్ శాఖ‌..

1. ములుగు పోలీస్ స్టేషన్ పరిధి.

సర్వపూర్ శివారులో బొగ్గులవాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా వరద ప్రవహిస్తోంది.
డైవర్షన్ రూట్: జగ్గన్నగూడెం వైపు ప్రయాణం చేసే వారు అంకన్నగూడెం మీదుగా వెళ్లాలి.

2. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి.

వెళ్తుర్లపల్లి నుండి కొండాపూర్ వెళ్లే రహదారిలో మోరంచ వాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా ప్రవహిస్తోంది.
డైవర్షన్ రూట్: కొండాపూర్ వెళ్లేవారు ఘన్పూర్ – ధర్మారావు పేట మీదుగా ప్రయాణించాలి.

3. పస్రా పోలీస్ స్టేషన్ పరిధి.

పస్రా నుండి ఏటూరునాగారం వెళ్లే మార్గంలో జలగలంచ వాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా ప్రవాహం ప్రవహిస్తుంది.
డైవర్షన్ రూట్: ఏటూరునాగారం వెళ్లే వారు పస్రా – నార్లపూర్ – మేడారం రోడ్డు మీదుగా మేడారం మార్గం ద్వారా ప్రయాణించాలి.

4. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధి.

1. చింతల్ నుండి ఎల్బాక మధ్యలో జంపన్న వాగు వరద ప్రవాహం పెరిగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తోంది. డైవర్షన్ రూట్: ఎల్బాక, పడిగపూర్ వెళ్లేవారు మేడారం – కొంగలమడుగు మార్గం ద్వారా వెళ్లాలి.

5. ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధి.

1. దొడ్ల నుండి కొండయి మధ్యలో జంపన్న వాగు వరద ప్రవహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి, కొండయి గ్రామం వెళ్లే వాళ్ళ కోసం పడవ సౌకర్యం కలదు.
2. ఎలిశెట్టిపల్లి నుండి చలిపాక మధ్యలో జంపన్న వాగు వరద ప్రవహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి, చలిపాక గ్రామం వెళ్లే వాళ్ళ కోసం పడవ సౌకర్యం కలదు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.