epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?
బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి..
ఐపీ పెట్టినట్లు మార్కెట్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ..!

కాకతీయ, వరంగల్ : వరంగల్ లో మరో అడ్తీ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో ఓ వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంట్లో కూడా ఎవరూ లేనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యాపారి డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వ్యాపారి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ. 5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయనే స్వచ్ఛందంగా మార్కెట్లోకి వస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా.. విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా.. వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు.. ఈ విషయంపై దృష్టిసారించి.. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల...

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి పెంచికలపేటలో బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం కాకతీయ,...

పెద్ది ఆశయ సాధనకు కదలాలి!

పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి...

జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌..

జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌.. ఈ నెల 31న హనుమకొండ...

రైతులను తక్షణమే ఆదుకోవాలి!

రైతులను తక్షణమే ఆదుకోవాలి! వరంగల్‌ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి మాజీ...

ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న...

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.