జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్..
ఈ నెల 31న హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభం..
https://docs.google.com/forms/d/e/1FAIpQLSccE57AVP9ejR0HACbXeVXtcZzPKxmPX-Ug109DyNr3X45M-Q/viewform.
కాకతీయ, హన్మకొండ : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం (ఏక్తా దివస్) సందర్భంగా, విజిలెన్స్ అవేర్నెస్ వీక్‌లో భాగంగా ఈ నెల 31న 5కే, 10కే వాక్‌థాన్, రన్ నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. జాతీయ ఐక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మట్టేవాడ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుని, తిరిగి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకోవడంతో వాక్‌థాన్, రన్ ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొనవచ్చని సీపీ వెల్లడించారు. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పాల్గొనాలనుకునే వారు కింది లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి అని తెలిపారు.

