పేకాట శిబిరంపై దాడి నలుగురి అరెస్ట్ ఇద్దరు పరారీ
కాకతీయ, గీసుగొండ:పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, గీసుగొండ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సిఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొమ్మాల గ్రామ శివారులో కడారి రాజు వ్యవసాయ భూమి వద్ద కొంతమంది పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు.ఈ సమయంలో కడారి రాజు,దునికే కొమురయ్య, బసికే ప్రభాకర్, లకావత్ గణేష్‌లను పట్టుకోగా, వాంకుడోత్ రాజు,పల్లె నరేష్‌లు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు,4 మోటార్ సైకిళ్లు, రూ.4,840 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు.

