వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
నర్సంపేట ఎస్సై రవి కుమార్, వి. ఆర్. లో ఉన్న ప్రవీణ్ కుమార్ లపై వేటు
అవినీతి ఆరోపణలే కారణం..
కాకతీయ, నర్సంపేట: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి అధికారుల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిస్తూ ఉన్న మిగతా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అవినీతి ఆరోపణలతో నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్. ఐ రవి కుమార్ తో పాటు, ఎల్కతుర్తిలో విధులు నిర్వహించి ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపలు ఇసుక, మట్టి దందాలు, తప్పుడు కేసుల బనాయింపు వంటి వాటిపైన సమగ్ర విచారణ జరిపి వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇద్దరు ఎస్సైలను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

